Begin typing your search above and press return to search.
అందుకే నేల టిక్కెట్టు టైటిల్ పెట్టాం
By: Tupaki Desk | 19 May 2018 11:30 PM GMTసోగ్గాడే చిన్ని నాయన - రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఇక ఈ సారి నేల టిక్కెట్టు తో కూడా మరో హిట్ కొట్టి హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం సినిమాపై అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ చాలానే ఉన్నాయి. ట్రైలర్ కూడా అంచనాలను పెంచింది. శక్తి కాంత్ అందించిన సంగీతం కూడా సినిమా స్థాయిని పెంచుతోంది.
ఇక ఈ విజయంపై పూర్తిగా నమ్మకంతో ఉన్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెలిపారు. ఇంకా ఏమన్నారంటే.. ఈ సినిమా ఫ్యామిలీ అండ్ ఎమోషన్స్ తో కూడుకున్నది. తప్పకుండా అన్ని వర్గాల వారికి నచ్చుతుంది. నేల టిక్కెట్టు సినిమా బాల్కనీ వాళ్లకు కూడా నచ్చుతుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు కూడా మాతో ఇదే చెప్పారు. రవితేజ కామెడీ అండ్ ఫైర్ రెండు ఈ సినిమాలో ఉంటాయి. హీరో పాత్ర ఆవారా అయినా కూడా అతను తన లైఫ్ లో ఎంతమందిని కలుపుకొని ఒక ఫ్యామిలీ గా సెట్ చేసుకున్నాడు అనేదే సినిమా కథ.
ఈ కథలో హీరో ఎక్కువగా మాస్ జనాలతో తీరుగుతూ ఉంటాడు. అందుకే నెల టిక్కెట్టు అనే టైటిల్ ని పెట్టాం. ఈ సినిమా షూటింగ్ ని కేవలం 90 రోజుల్లోనే ఫినిష్ చేశాం. రవి తేజతో వర్క్ చెయడం చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఇక ఆయనలోని కమిట్మెంట్ కూడా నాకు చాలా నచ్చుతుంది. చాలా నేర్చుకున్నా కూడా.. నా సినిమా చివరి రోజు షూటింగ్ ముగియగానే మైత్రీ మూవీ మేకర్స్ వారి సినిమాను మొదలు పెట్టారు. ఆ కమిట్మెంట్ అందరికి ఉండదు. ఇక హీరోయిన్ మాళవిక కూడా సినిమాలో అద్భుతంగా నటించిందని చెబుతూ.. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకమని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ వివరించారు.