Begin typing your search above and press return to search.

డబ్బే ముఖ్యం అంటున్న సంగీత దర్శకుడు

By:  Tupaki Desk   |   1 Sep 2015 7:47 PM GMT
డబ్బే ముఖ్యం అంటున్న సంగీత దర్శకుడు
X
అవసరం మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది. ప్రస్తుత కాలంలో సగటు మనిషి ముఖ్య అవసరం డబ్బే. నేనూ సగటు మనిషినే. నా కుటుంబానికి మంచి లగ్జరీ లైఫ్ ఇవ్వడం కోసమే నేను కష్టపడుతున్నాను. డబ్బే నాకు ఇస్పిరేషన్ అని అంటున్నారు సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్. అంతటితో సరిపెడితేనా... సాధారణంగా నేను సెలెక్టివ్ గా సినిమాలు చేస్తానని అనుకుంటూంటారు.. అది అవాస్తవం. అవకాశాలు లేక ఖాళీగా వుంటాను. అని అసలు విషయాన్ని నిర్మొహమాటంగా బయటపెట్టేశాడు ఈ సంగీత దర్శకుడు.

సున్నితత్త్వం తన పాటల్లోనే కాదు వ్యక్తిలోనూ వుంటుంది అని కళ్యాణ్ గురించి పరిశ్రమ సన్నిహితులు చెబుతూ వుంటారు. అలాంటిది ఉన్నట్టుండి డబ్బు కోసమే చేస్తున్నా అన్నాడంటే ఎంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడో.. ప్రతిభ లేదా అంటే తీస్కోవడం అవతలి వాళ్లకి తెలీదనాలి. ఎంత చక్కటి బాణీలను అందించారు. అలా మొదలైంది హిట్ అయినా ఏడాది వరకూ మరో సినిమా లేదు. గోల్కొండ స్కూల్, అంతకు ముందు ఆ తర్వాత గతేడాది ఊహలు గుసగుసలాడే ఇలా సంవత్సరానికో శివరాత్రి అన్నట్టు సాగింది అయన కెరీర్. ప్రస్తుతం నందినిరెడ్డి నాగశౌర్య కాంబినేషన్ లో వస్తున్న కళ్యాణ వైభోగమే సినిమాతో పాటు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న కళ్యాణ్ మున్ముందు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుందాం.