Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్.. కళ్యాణ్‌ రామ్‌ ను ఆపలేదు

By:  Tupaki Desk   |   29 March 2018 12:59 PM IST
ఎన్టీఆర్.. కళ్యాణ్‌ రామ్‌ ను ఆపలేదు
X
ఒకవైపు సినీ సెలబ్రెటీలు.. మరోవైపు రాజకీయ ప్రముఖులు.. చూడ్డానికి రెండు కళ్లూ సరిపోలేదు. ఈ మధ్య కాలంలో ఏ సినీ వేడుకకూ ఇంతమంది అతిథులు హాజరై ఉండరేమో. ఆ స్థాయిలో హంగామా కనిపించింది ‘యన్.టి.ఆర్’ ప్రారంభోత్సవంలో. సినీ పరిశ్రమ నుంచి పదుల సంఖ్యలో ప్రముఖులు తరలివచ్చారు. రాఘవేంద్రరావు.. బోయపాటి శ్రీను.. పూరి జగన్నాథ్.. ఎం.ఎం.కీరవాణి.. ఇలా ఎందరో సెలబ్రెటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు. నందమూరి కుటుంబం నుంచి కూడా చాలామందే వచ్చారు. అందులో కళ్యాణ్ రామ్ కూడా ఉండటం విశేషం. కానీ అతడి తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు.

తమ కుటుంబానికి ప్రతిష్టాత్మకమైన సినిమా కావడంతో నందమూరి ఫ్యామిలీలో దాదాపు అందరికీ ఆహ్వానాలు పంపిన బాలయ్య.. ఎన్టీఆర్ కు మాత్రం ఇన్విటేషన్ ఇవ్వలేదు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం ఆహ్వానం అందుకున్నాడు. గత కొన్నేళ్లలో తమ్ముడికి బాగా దగ్గరైన కళ్యాణ్ రామ్.. అతడిని ఈ వేడుకకు ఆహ్వానించని నేపథ్యంలో తాను కూడా గైర్హాజరవుతాడా.. అతడిని ఎన్టీఆర్ ఆపుతాడా అన్న చర్చ నడుస్తోంది కొన్ని రోజులుగా. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఎన్టీఆర్ అన్నను ఆపలేదు. కళ్యాణ్ రామ్ కూడా ఆగలేదు. ఐతే ఈ వేడుకలో హరికృష్ణ కూడా లేని విషయం గమనార్హం. ఆయనకు బాలయ్య ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఐతే తన చిన్న కొడుకును పట్టించుకోనందుకో ఏమో ఆయన కూడా ఆ వేడుకలో పాల్గొనలేదు. కొంత కాలంగా హరికృష్ణ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరం పెట్టేశారు. బాలయ్య వాళ్లను అస్సలు పట్టించుకోవడం లేదు.