Begin typing your search above and press return to search.
'బింబిసార' లో కీ పాయింట్ అదేనా..?
By: Tupaki Desk | 9 Jun 2022 2:30 AM GMTనందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ''బింబిసార''. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనే ట్యాగ్ లైన్ తో రూపొందున్న ఈ సినిమాతో మల్లిడి వశిష్ఠ్ అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.
'బింబిసార' అనేది టైమ్ ట్రావెల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఆధునిక చారిత్రక యుగాలకు సంబంధించిన కథను చెప్పబోతున్నారు. సినిమా రెండు వేర్వేరు టైమ్ లైన్‌లలో ఉంటుంది. అయితే ఇదంతా ఓ మ్యాజికల్ అద్దం చుట్టూ తిరుగుతుందని టాక్ నడుస్తోంది.
సినిమా కథంతా గతంలోనూ, వర్తమానంలోనూ నడుస్తుండగా.. ఇది ఓ మాయా అద్దంతో ముడిపడి ఉంటుందట. ఈ మ్యాజికల్ మిర్రర్ అనేదే కథనంలో కీ పాయింట్ అని అంటున్నారు. ఈ మాయా అద్దం రహస్యం ఏమిటి? అసలు ఇందులో నిజమెంతనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
ఇకపోతే 'బింబిసార' సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన కాలక్రమాలకు తగ్గట్టుగా రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తాడు. క్రూరమైన బార్బేరియన్ కింగ్ గానే కాకుండా.. మోడ్రన్ యువకుడిగానూ కనువిందు చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - గ్లింప్స్ తో ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.
కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో నటించడమే కాకుండా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై స్వయంగా నిర్మించారు. ఇది కల్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో అత్యున్నత సాంకేతిక హంగులతో తెరకెక్కుతున్న సినిమా.
'బింబిసార' చిత్రంలో కేథరీన్ ట్రెసా - సంయుక్త మేనన్ మరియు వరీనా హుస్సేన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం సమకూర్చారు. ఎంఎం కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారని టాక్.
'బింబిసార' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2022 ఆగస్ట్ 5న భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'ఎంత మంచివాడవురా' తర్వాత గ్యాప్ తీసుకొని రాబోతున్న కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.