Begin typing your search above and press return to search.
పట్టువదలని విక్రమార్కుడు .. కల్యాణ్ రామ్
By: Tupaki Desk | 5 July 2021 3:30 AM GMTసాధారణంగా ఎవరైనా ఒక మార్గంలో ముందుకు వెళ్లాలని అనుకున్నప్పుడు, ఏవైనా అవరోధాలు ఎదురైతే వెనక్కి వెళ్లిపోవాలని అనుకుంటారు. లేదంటే తమ ప్రయాణాన్ని అక్కడితో ఆపేయాలని నిర్ణయించుకుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో ముందుకు వెళ్లకపోవడమే మంచిదని భావిస్తారు .. అధైర్యంతో వెనకడుగు వేస్తారు. అలా కాకుండా ఎలాంటి అవాంతరాలెదురైనా ముందుకు వెళ్లవలసిందే .. అనుకున్న గమ్యానికి చేరుకోవాలసిందే అనే తెగువ కొంతమందిలో మాత్రమే కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో అడుగుముందుకు వేసే ఆ కొందరిలో కల్యాణ్ రామ్ కూడా కనిపిస్తాడు.
హీరోగా సక్సెస్ రాకపోతే ఎవరైనా సరే ఎంతోకొంత కుంగిపోతారు. నిర్మాతగా పెద్దగా లాభాలు రాకపోతే అసంతృప్తికి .. అసహనానికి లోనవుతారు. అయితే ఈ రెండింటి విషయంలో కల్యాణ్ రామ్ పట్టుదల చూస్తే ఎంతటివారికైనా ఆశ్చర్యం కలగక మానదు. హీరోగా .. నిర్మాతగా కూడా వరుసగా దెబ్బతిన్నా, తనపై తనకి గల నమ్మకాన్ని కోల్పోలేదు. అలాగే తాను చేయదలచుకున్న ప్రయోగాలను ఆపలేదు. సాహసోపేతమైన నిర్ణయాలను మార్చుకోలేదు. ఆయన సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
కెరియర్ తొలినాళ్లలో 'అతనొక్కడే' వంటి హిట్ అందుకున్న కల్యాణ్ రామ్, ఆ తరువాత 'పటాస్' .. '118' వంటి చెప్పుకోదగిన హిట్లను అందుకున్నాడు. తనని తాను మార్చుకుంటూ .. మలుచుకుంటూ డిఫరెంట్ గా కనిపించడానికే ఆయన ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్తగా ప్రేక్షకుల ముందుకు వెళ్లడానికే ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా చారిత్రక నేపథ్యంలో 'బింబిసార' రూపొందుతోంది. తొలిసారిగా చారిత్రక నేపథ్యాన్ని టచ్ చేసి అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. అంతేకాదు మరో రెండు మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టేశాడు. ఈ రోజు ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరెన్నో విజయాలను అందుకోవాలని కోరుకుందాం.