Begin typing your search above and press return to search.

జూనియర్ కోసం బ్రదర్ ఖర్చెంతో తెలుసా

By:  Tupaki Desk   |   13 April 2017 4:42 AM GMT
జూనియర్ కోసం బ్రదర్ ఖర్చెంతో తెలుసా
X
తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ తో జై లవ కుశ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇటు హీరోగా కంటిన్యూ అవుతూనే.. సినిమా నిర్మాణం కూడా చేయడం కళ్యాణ్ రామ్ కు అలవాటు. ప్రొడ్యూసర్ గా భారీ చిత్రాలనే నిర్మించే కళ్యాణ్ రామ్ కు.. నిర్మాతగా జై లవ కుశ అతి పెద్ద చిత్రం అనడంలో సందేహం లేదు.

కానీ ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్.. రీసెంట్ గా రెండు ఎదురుదెబ్బలు తిన్నాడు. రవితేజ హీరోగా రూపొందిన కిక్2.. తనే హీరోగా నటించిన ఇజం చిత్రాలు.. దారుణంగా దెబ్బతిన్నాయి. భారీ నష్టాలను మిగిల్చాయి. ఈ రెండు సినిమాలతో.. దాదాపు 20 కోట్లకు పైగా నష్టాలు వాటిల్లినట్లు చెబుతారు ట్రేడ్ జనాలు. అయినా సరే.. ఇప్పుడు తమ్ముడు ఎన్టీఆర్ తో తీస్తున్న చిత్రానికి భారీ బడ్జెట్ నే కేటాయించాడని తెలుస్తోంది. జై లవ కుశకు 55 కోట్ల రూపాయల బడ్జెట్ గా అనుకుంటున్నారట. మూవీ పూర్తయ్యే నాటికి ఈ మొత్తం మరికొంత పెరిగే అవకాశాలున్నాయని కూడా అంటున్నారు.

దర్శకుడు బాబీ చెప్పిన స్క్రిప్ట్ విపరీతంగా నచ్చడం.. ఇతర క్యాస్టింగ్ విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉండడం.. ప్రాజెక్టుపై పూర్తి కాన్ఫిడెన్స్ ఉండడంతో.. కళ్యాణ్ రామ్ ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించాలనే టార్గెట్ ను కచ్చితంగా అందుకుంటానని నమ్మకంగా ఉన్నాడట కళ్యాణ్ రామ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/