Begin typing your search above and press return to search.
జై లవ కుశకి అంతడిగాడా?
By: Tupaki Desk | 25 May 2017 4:18 AM GMTప్రస్తుతం ఓవర్సీస్ లో కలెక్షన్స్ లెక్కలు మారిపోయిన సంగతి తెలిసిందే. బడా కంపెనీలు అయిన ఏఎంసీ-కార్మిక్ ధియేటర్లు లు విలీనం అయిపోవడంతో.. వసూళ్ల నుంచి వచ్చే షేర్ పై బాగానే ఎఫెక్ట్ కనిపిస్తోంది. కానీ టాలీవుడ్ నిర్మాతలు మాత్రం ఇదేమీ పట్టించుకున్నట్లు గా కనిపించడం లేదు. ఓవర్సీస్ హక్కుల రూపంలో భారీ మొత్తాన్ని రాబట్టుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ మూవీ జై లవ కుశ ఓవర్సీస్ రైట్స్ కోసం.. ఓ డిస్ట్రిబ్యూటర్ సంప్రదిస్తే.. మైండ్ బ్లాంక్ అయ్యే ఫిగర్ చెప్పాడట నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్. ఏకంగా 14 కోట్ల రూపాయలను కోట్ చేశాడని అంటున్నారు. ఇది చాలా పెద్ద మొత్తం అని ట్రేడ్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్ ప్రకారం.. 14 కోట్ల మొత్తాన్ని రికవర్ చేసుకోవాలంటే.. అక్కడ సినిమా కనీసం 3 మిలియన్ డాలర్లను వసూలు చేయాల్సి ఉంటుంది. అప్పుడే పెట్టిన పెట్టుబడి రికవర్ అవుతుంది. యంగ్ టైగర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన జనతా గ్యారేజ్.. ఓవర్సీస్ లో 2 మిలియన్ డాలర్ల మార్క్ ను కూడా అందుకోలేకపోయింది. దానికి ముందు నాన్నకు ప్రేమతో మూవీ 2.2 మిలియన్ డాలర్లు వసూలు చేసినా.. అందులో సుకుమార్ కు ఉన్న మార్కెట్ కూడా మిక్స్ అయి ఉంటుంది. సో లవ కుశపై అంతటి భారం వేస్తే కష్టమే.
ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న జై లవ కుశ చిత్రానికి.. కేవలం ఎన్టీఆర్ మాత్రమే క్రౌడ్ పుల్లర్. ఇటు నిర్మాత కళ్యాణ్ రామ్ సినిమా అనో.. అటు బాబీ సినిమా అనో పెద్దగా హైప్ వచ్చే ఛాన్సే లేదు. మరి ఇవన్నీ తెలిసి కూడా 14 కోట్లు ఎలా కోట్ చేశారనే విషయం మాత్రం ట్రేడ్ వర్గాలకు కూడా అర్ధం కావట్లేదట. ఇక మహేష్ బాబు స్పైడర్ కు అయితే నిర్మాతలు ఏకంగా 25 కోట్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని ఓ టాక్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/