Begin typing your search above and press return to search.
‘ఓం’ కష్టనష్టాలపై కళ్యాణ్ రామ్..
By: Tupaki Desk | 10 Jun 2018 4:29 AM GMTనందమూరి కళ్యాణ్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన సినిమా ‘ఓం’. ఇండియాలో తొలి త్రీడీ యాక్షన్ ఫిలిం అంటూ దీని గురించి చిత్ర బృందం గొప్పగానే ప్రచారం చేసుకుంది. కళ్యాణ్ రామ్ ఏకంగా రూ.25 కోట్ల దాకా ఖర్చు పెట్టి.. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ సినిమాను నిర్మించాడు. కానీ ఆ చిత్రం దారుణమైన ఫలితాన్నందుకుంది. ఆ చిత్రానికి త్రీడీ ఏమంత ఆకర్షణ కాలేకపోయింది. దాదాపుగా పెట్టుబడి మొత్తం పోగొట్టుకున్నాడు కళ్యాణ్. ఆ సినిమా గురించి మాట్లాడినపుడల్లా చాలా ఆవేదన వ్యక్తం చేస్తాడతను. తన కొత్త సినిమా ‘నా నువ్వే’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కళ్యాణ్ రామ్ ‘ఓం’ కష్టనష్టాల గురించి పంచుకున్నాడు. ఆ సినిమా తననెంతగా దెబ్బ కొట్టిందో.. అసలా సినిమా ఎందుకు పోయిందో వివరించాడు.
‘‘ఓం సినిమాతో కొత్తగా ఏదో చేయాలనుకున్నా. అప్పటికి మనకు త్రీడీ అంతగా తెలియదు.. ఓ టెక్నాలజీని చూపిద్దాం అనుకున్నా. ఐతే ఏదైనా కొత్త సాంకేతికతను ప్రవేశపెడుతున్నపుడే అందులోని ఇబ్బందులు తెలిసొస్తాయి. రోజులు గడుస్తున్న కొద్దీ అనుభవంలోకి వస్తాయి. ఆ సినిమా విషయంలో అదే జరిగింది. కెమెరా అమర్చుకోవడానికే గంట సమయం పట్టేది. ఒకసారి కెమెరా సెట్ చేస్తే దాన్ని ముందుకు వెనక్కి కదపడానికి అవకాశముండేది కాదు. హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకురావడంతో బడ్జెట్ పెరిగిపోయింది. వాళ్లు గంటకు ఇంత అని పని చేసేవాళ్లు. దీంతో ఖర్చు బాగా పెరిగిపోయింది. మూడేళ్ల శ్రమ ఆ సినిమా. నా కష్టం.. డబ్బు అన్నీ దాంట్లో పెట్టా. దాని ఫలితం నాకు పెద్ద షాక్. డబ్బులు చాలా పోయాయి. ఐతే నేనేమీ గ్యాంబ్లింగ్ చేసి డబ్బులు పోగొట్టుకోలేదు కదా.. సినిమాతోనే కదా అని సరిపెట్టుకున్నా’’ అని కళ్యాణ్ రామ్ తెలిపాడు.