Begin typing your search above and press return to search.
కళ్యాణ్ రామ్ ఎక్కడ?
By: Tupaki Desk | 28 Aug 2015 8:28 PM GMTటాలీవుడ్ లో కమిట్ మెంట్ ఉన్న హీరో కమ్ నిర్మాత కళ్యాణ్ రామ్. తనేదో తన పనేదో అన్నట్లుంటాడు. హీరోగా ఎంత పెద్ద రిస్క్ చేసినా అది సొంత బేనర్ లోనే అయ్యుంటుంది. అలా రిస్క్ చేసిన చాలా దెబ్బలు తిన్నాడు. ఐతే చాలా ఎదురుదెబ్బల తర్వాత ఈ ఏడాది ‘పటాస్’తో సక్సెస్ కొట్టాడు. దీని కంటే ముందు తన నిర్మాణంలో కిక్-2 మొదలుపెట్టాడు. పటాస్ హిట్టయ్యేసరికి కళ్యాణ్ రామ్ కు వెయ్యేనుగుల బలం వచ్చినట్లయింది. ఆ సినిమాను పెద్దగా లాభం పెట్టుకోకుండా దిల్ రాజుకు అమ్మేయడం వల్ల కళ్యాణ్ రామ్ కు మిగిలిందేమీ లేదు. కిక్-2కు మంచి క్రేజ్ రావడంతో ఆ సినిమాతో బాగా మిగుల్చుకుందామనుకున్నాడు. కానీ ఉన్నది పోయే పరిస్థితి వచ్చింది. ఖర్చుకు తగ్గట్లు బిజినెస్ కాకపోయినా.. రిలీజ్ తర్వాత రికవర్ అయిపోతుందిలే అనుకుని సాహసం చేశాడు. కానీ నష్టాలు తప్పట్లేదు.
ఐతే అసలే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినపుడు.. ప్రమోషన్ కొంచెం గట్టిగా చేయాల్సిన అవసరముంది. కానీ ‘కిక్-2’ విషయంలో అలాంటిదేమీ జరిగినట్లు అనిపించలేదు. విడుదలకు ముందు రవితేజ ఇంటర్వ్యూలవీ ఇచ్చి బాగానే సందడి చేశాడు. కానీ తర్వాత పత్తా లేకుండా పోయాడు. ‘శ్రీమంతుడు’ విషయంలో మహేష్ రిలీజ్ తర్వాత కూడా సినిమాను ఎలా ప్రమోట్ చేశాడో అందరూ చూశారు. దాని వల్ల మంచి ఫలితం కూడా వచ్చింది. ‘కిక్-2’ విషయానికొస్తే సురేందర్ రెడ్డి మాత్రం రిలీజ్ తర్వాత ఓ ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో కిక్-3 తీస్తా, రేసుగుర్రం-2 తీస్తా అంటూ తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం తప్పితే.. కిక్-2 ప్రమోషన్ సరిగా చేయలేదు. ఇప్పుడు రకుల్ వచ్చి ఏదో మాట్లాడి వెళ్లింది. ఈ ప్రమోషన్స్ లో అసలు నిర్మాత అయిన కళ్యాణ్ రామ్ ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఓ స్టార్ హీరో, డైరెక్టర్ తో సినిమా నిర్మించిన అతడికీ ఓ వాల్యూ ఉంది. మరి అతను సినిమా గురించి ఒక్క మాట మాట్లాడట్లేదు. తన సినిమా ప్రమోషన్ విషయంలో ఉత్సాహం చూపించలేదు. దీన్ని బట్టే కిక్-2 విషయంలో కళ్యాణ్ రామ్ ముందు నుంచి చాలా అసంతృప్తిగా ఉన్నాడన్న రూమర్లు నిజమే అనిపిస్తోంది.