Begin typing your search above and press return to search.
ఆ సినిమా నన్ను కుదేలు చేసింది-కళ్యాణ్ రామ్
By: Tupaki Desk | 29 Oct 2015 8:30 AM GMTనందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి తీసిన సినిమా ‘ఓమ్’. తెలుగులో వచ్చిన తొలి యాక్షన్ త్రీడీ సినిమా ఇది. సబ్జెక్ట్ మీద, త్రీడీ టెక్నాలజీ మీద నమ్మకంతో ఏకంగా పాతిక కోట్లు ఖర్చు పెట్టేశాడు కళ్యాణ్ రామ్. కానీ సినిమా దారుణమైన ఫలితాన్ని చూసింది. కళ్యాణ్ రామ్ కు భారీ నష్టాలు మిగిల్చింది. ఈ సినిమా పరాజయం నుంచి కోలుకోవడానికి తనకు చాలా టైమే పట్టిందని అంటున్నాడు నందమూరి హీరో.
‘‘ఓమ్ త్రీడీ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాను. ఆ సమయంలో మరో సినిమా ఏదీ ఒప్పుకోలేదు. దేనిమీదా దృష్టిపెట్టలేదు. త్రీడీ టెక్నాలజీ ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికే చాలా టైం తీసుకున్నాం. ఐతే ఎంతో కష్టపడి తీసిన ఆ సినిమా ఆడలేదు. చాలా బాధపడ్డాను. నెగెటివ్ రివ్యూలొచ్చాయి. జనాల మాట కూడా అలాగే ఉంది. దీంతో జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఓమ్ సినిమా నన్ను ఒకరకంగా కుదేలు చేసింది. సినిమా ఎందుకలా అయ్యిందని ఆలోచించా. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లెంగ్త్ ఎక్కువైందనిపించింది. ట్విస్టులు కూడా ఎక్కువ పెట్టేశామేమో అనిపించింది. సినిమా మరీ సీరియస్ గా ఉండటం వల్ల కూడా ప్రేక్షకులకు నచ్చలేదు. ఈ సినిమాతో నేనో పాఠం నేర్చుకున్నా. సినిమా భారీగా అయినా ఉండాలి లేదా ఎంటర్ టైన్ మెంట్ అయినా ఉండాలి’’ అని కళ్యాణ్ రామ్ చెప్పాడు.
ఐతే సక్సెస్, ఫెయిల్యూర్స్ గురించి ఎక్కువ ఆలోచించే దశను తాను దాటిపోయానని కళ్యాణ్ రామ్ చెప్పాడు. ‘‘సుదీర్ఘ కాలంగా ఇండస్ట్ట్రీలో ఉన్నా. నా సినిమాలు విజయాలు - పరాజయాలు నన్ను పెద్దగా ప్రభావితం చేయవు. సినిమా హిట్టయితే అస్సలు దాని గురించి పట్టించుకోను. ఫ్లాపైతే ఎందుకలా జరిగిందని మాత్రం కొంచెం ఆలోచిస్తున్నా’’ అన్నాడు.