Begin typing your search above and press return to search.
బాలయ్య గోలలో కళ్యాణ్ రామ్ క్లాస్
By: Tupaki Desk | 26 Feb 2019 4:50 AM GMTప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్ టాలీవుడ్ లో దర్శకుడిగా డెబ్యు చేస్తున్న 118 ఈ నెల మార్చ్ 1న విడుదల కాబోతోంది. ప్రీ రిలీజ్ నిన్న గ్రాండ్ గా చేసేసారు. బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ అతిధులుగా రావడం ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తింది. కళ్యాణ్ రామ్ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు అభిమానులు చేసిన అల్లరి తనతో చిన్న క్లాసు తీసుకునేలా చేయడం ఎవరి దృష్టి దాటిపోలేదు. స్పీచ్ మొదలుపెట్టడానికి రెడీ అవుతున్న సమయంలో కొందరు అదే పనిగా జై బాలయ్య జైజై బాలయ్య అంటూ నినాదాలతో కాసేపు హోరెత్తించారు.
తాను ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని అయోమయం కళ్యాణ్ రామ్ లో కొంత సేపు నెలకొంది. సైలెంట్ గా ఉండమని రిక్వెస్ట్ చేస్తూ మనమంతా పెద్దాయన నందమూరి తారకరామరావు వారి అడుగుజాడల్లో నడవాలని ఆయన నేర్పిన క్రమశిక్షణ మర్చిపోకూడదని పదే పదే విజ్ఞప్తి చేసాడు. అయినా అల్లరి వెంటనే తగ్గలేదు. ఇంకో రెండు సార్లు విన్నవిస్తే కాని పరిస్థితి సద్దుమణగలేదు
గతంలో చేసిన ఫెయిల్యూర్స్ ని ఒప్పుకున్న కళ్యాణ్ రామ్ తమ్ముడు ఓసారి టెంపర్ ఆడియోలో చెప్పిన మాటలనే స్ఫూర్తి తీసుకుంటానని మంచి సినిమాలతో మెప్పించే ప్రయత్నం మానుకోనని నొక్కి చెప్పాడు. ఈ 118 గురించి సక్సెస్ అయ్యాకే మాట్లాడతానని బాబాయ్ తమ్ముడిని పక్కన పెట్టుకుని ఎక్కువ మాటలు రావడం లేదని చెప్పిన కళ్యాణ్ రామ్ మొత్తానికి డిసిప్లిన్ గురించి కాసేపు సున్నితంగా క్లాస్ తీసుకోవడం విశేషం.
118 హిట్ కావడం కళ్యాణ్ రామ్ కు చాలా అవసరం. అందుకే ఇమేజ్ ని పక్కన పెట్టి కేవలం రెండే పాటలతో థ్రిల్లర్ జానర్ ని ట్రై చేసాడు. ఇప్పటికే ట్రైలర్ మంచి స్పందన దక్కించుకున్న నేపధ్యంలో ఓపెనింగ్స్ మీద గట్టి నమ్మకం పెట్టుకున్నాడు. పెద్దగా పోటీ లేదు కాబట్టి టాక్ కనక బాగా వస్తే 118 జోరు కొనసాగించవచ్చు