Begin typing your search above and press return to search.

కళ్యాణ్ కష్టానికి తగ్గ ఫలితం దొరికేనా ?

By:  Tupaki Desk   |   27 Feb 2019 5:17 AM GMT
కళ్యాణ్ కష్టానికి తగ్గ ఫలితం దొరికేనా ?
X
ఇంకో రెండు రోజుల్లో కళ్యాణ్ రామ్ 118 విడుదల కాబోతోంది. భీభత్సమైన హైప్ తో భారీ అడ్వాన్సు బుకింగ్స్ తో సందడి చేసేంత రేంజ్ లో హైప్ లేదు కాని ట్రైలర్ చూసాక ప్రేక్షకుల్లో నమ్మకం కలిగిన మాట వాస్తవం. మాస్ మసాలాలకు దూరంగా థ్రిల్లర్ జానర్ లో పాటల హంగులకు దూరంగా ఏదో కొత్త ప్రయత్నం చేసాడన్న అభిప్రాయం బలంగా కలిగింది. రేపు ఓపెనింగ్స్ వచ్చాయంటే అది దీని వల్లే అని చెప్పొచ్చు.

ఒకపక్క ఎన్టీఆర్ రెండు భాగాలూ ఒకదాన్ని మించి డిజాస్టర్ కావడం పట్ల నందమూరి ఫ్యాన్స్ బాగా డిస్టర్బ్ గా ఉన్నారు. వాళ్ళకు స్వాంతన చేకూరాలి అంటే 118 యావరేజ్ కాదు సూపర్ హిట్ అనే టాక్ తెచ్చుకునే తీరాలి. ఆడియోలో రెండే పాటలు పెట్టి సబ్జెక్టు మీద ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన దర్శకుడు కెవి గుహన్ పనితనం గురించి మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ సహా అందరూ ప్రత్యేకంగా పొగడటం ప్లస్ అవుతోంది

కళ్యాణ్ రామ్ మరో కలిసి వచ్చే అంశం ఏమిటంటే పెద్దగా పోటీ లేకపోవడం. అజిత్ విశ్వాసం ఉంది కాని అది మనవాళ్ళకు కనెక్ట్ అయ్యే రేంజ్ లో అందులో కొత్తదనం ఏమి ఉండదు. పైగా అమెజాన్ లో అధికారికంగా దాని ఒరిజినల్ ప్రింట్ సబ్ టైటిల్స్ తో సహా వచ్చేసింది కాబట్టి 118ను కాదని విశ్వాసం ఓటేసే తటస్థ ప్రేక్షకులు ఎక్కువగా ఉంటారు అనుకోలేం. గత ఏడాది ఎమెల్యే-నా నువ్వేలతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన కళ్యాణ్ రామ్ దీని మీద మాత్రం చాలా నమ్మకంగా ఉన్నాడు. శాలిని పాండే-నివేడా థామస్ హీరొయిన్లుగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ నందమూరి హీరో కోరుకుంటున్న టార్గెట్ ని చేరుకుంటుందో లేదో చూద్దాం