Begin typing your search above and press return to search.
నందమూరి కాంపౌండ్ లో వివాదాస్పద హీరో చిత్రం?
By: Tupaki Desk | 4 Dec 2017 12:43 PM GMTమలయాళ నటి కిడ్నాప్ కేసులో ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ అరెస్టయిన రెండు నెలల తర్వాత బెయిలుపై విడుదలైన సంగతి తెలిసిందే. సినీ ఫక్కీలో జరిగిన ఈ కిడ్నాప్ కేసులో దిలీప్ పేరు రావడం మాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, దిలీప్ అరెస్టయిన సమయంలోనే అతడు రాజకీయ నేపథ్యంలో నటించిన `రామ్ లీలా` సినిమా విడుదలకు రకరకాల కారణాల వల్ల అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. ఎట్టకేలకు ఆ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. పొలిటికల్ కమ్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో దిలీప్ ఓ ఎమ్మెల్యే పాత్రలో నటించాడు. అయితే, వేరే ఎమ్మెల్యే హత్య కేసులో పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ అతడిని సస్పెండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో సాగే ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీని త్వరలో తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
`రామ్ లీలా` తెలుగు రీమేక్ హక్కులను ఓ నిర్మాత కొనుగోలు చేశాడట. ఆ చిత్రంలో దిలీప్ పాత్రలో నటించేందుకు సరైన హీరో, దర్శకుడి వేటలో ఆ నిర్మాత ఉన్నాడని సమాచారం. ఇప్పటికే ఈ కథను మాస్ మహారాజా రవితేజ విన్నప్పటికీ అందులో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదట. ఈ సినిమాను రాణా కూడా చూశాడట. అయితే, ఈ కథ నేనే రాజు నేనే మంత్రి ని పోలి ఉండడంతో రాణా రిజెక్ట్ చేశాడట. అయితే, ఈ చిత్రంలో నటించేందుకు నందమూరి హీరో కల్యాణ్ రామ్ దాదాపుగా అంగీకరించినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్రాన్ని టీడీపీ తరపున ప్రచారానికి వాడుకోవచ్చని కల్యాణ్ రామ్ భావిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. మరి, నందమూరి హీరో ఈ చిత్రంలో నటిస్తున్నాడా లేదా అన్న సంగతి తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.