Begin typing your search above and press return to search.
రంగస్థలంతో పోటీ ఉంది
By: Tupaki Desk | 26 Jan 2018 4:27 AM GMTగత రెండు మూడు రోజులుగా మహానటి విడుదల వాయిదా గురించి వార్తలు వస్తున్న నేపధ్యంలో నిర్మాతలు స్పందిచినట్టుగా తెలుస్తోంది. మార్చ్ 29 రిలీజ్ చేస్తామని గతంలో లోగో లాంచ్ లో ప్రకటించిన నిర్మాతలు దానికే కట్టుబడి ఉండబోతున్నట్టు స్పష్టం చేసారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లో రానుంది. కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్ ఇంకా పెండింగ్ ఉందని, దాని వల్లే ఆలస్యం అయ్యే అవకాశాల గురించి కథనాలు రావడంతో టీం బదులిచ్చింది. కీర్తి సురేష్ సావిత్రిగా దుల్కర్ సల్మాన్ జెమిని గణేషన్ గా నటిస్తున్న మహానటి షూటింగ్ 80 శాతం పైగా పూర్తయింది. ఎన్టీఆర్ కు సంబంధించిన సీన్స్ మాత్రం ఇంకా పెండింగ్ లో ఉన్నట్టు టాక్. ఆ పాత్ర ఎవరితో వేయించాలని తీవ్ర తర్జన భర్జనలు జరిగాయి. న్యాచురల్ స్టార్ నానితో ఇది చేయించవచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి కాని అఫీషియల్ గా దీని గురించి ఎటువంటి నోట్ లేదు.
సో రంగస్థలం పోటీ లేకుండా వచ్చే ఛాన్స్ లేనట్టే. మహానటిలో సోలోగా స్టార్ హీరో ఉన్నారు అని చెప్పే అవకాశం లేనప్పటికీ ఇందులో వివిధ పాత్రల్లో పేరున్న స్టార్స్ నటించడంతో పాటు మొదటిసారి తెలుగు తెరపై సావిత్రి గారి జీవిత కథ చూడబోతున్నాం అనే పాయింట్ ఈ సినిమా విషయంలో ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. శాలిని పాండే - విజయ్ దేవరకొండ - ప్రకాష్ రాజ్ - మోహన్ బాబు లతో పాటు సావిత్రి గారితో పనిచేసిన దర్శకుల పాత్రల్లో క్రిష్ - తరుణ్ భాస్కర్ తదితరులు కనిపించబోతున్నారు. ఒక జర్నలిస్ట్ గా సమంతా మనకు కథ చెబుతున్నట్టుగా మహానటి నెరేషన్ ఉంటుందని టాక్.
అన్నట్టు ఈ పోటీ ఇక్కడితో ఆగేలా లేదు. నందమూరి కళ్యాణ్ రామ్ ఎమెల్యే(మంచి లక్షణాలున్న అబ్బాయి)ని మార్చ్ 28న విడుదల చేసే ఆలోచనలో ఆ నిర్మాతలు ఉన్నట్టు టాక్. ఇది కన్ఫర్మ్ చేయలేదు కాని కంటెంట్ మీద నమ్మకంతో రెండు పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా సరే తమది కూడా నిలుస్తుంది అనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఒకవేళ అదే నిజమైతే ట్రిపుల్ బొనంజా ఖాయం. ఏదైనా మూడు సినిమాల అఫీషియల్ నోట్స్ వచ్చే దాకా ఇప్పుడే కంక్లూజన్ కు రాలేం.