Begin typing your search above and press return to search.

అబ్బాయ్ సెన్సార్ కు వెళ్తున్నాడటగా..

By:  Tupaki Desk   |   14 March 2018 12:48 PM GMT
అబ్బాయ్ సెన్సార్ కు వెళ్తున్నాడటగా..
X
అటు నిర్మాతగా ఇటు హీరోగా కెరీర్లో బాగానే స్థిరపడ్డాడు కళ్యాణ్ రామ్. గతేడాది తను నిర్మించిన జై లవ కుశ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ హీరోగా ఎం.ఎల్.ఏ సినిమాతో రాబోతున్నాడు. మంచి లక్షణాలున్న అబ్బాయి అంటూ త్వరలోనే సందడి చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాలో మనోడు అప్పుడెప్పుడో 10 ఏళ్ళ క్రితం లక్ష్మీ కళ్యాణం చేశాక.. ఇప్పుడు మరోసారి కాజల్ అగర్వాల్ తో రొమాన్స్ చేస్తున్నాడు.

ఇంతకీ ఈ సినిమా టైటిల్ చూస్తే పొలిటికల్ గా ఉంది. మనోళ్ళేమో కాదంటున్నారు. అసలు మ్యాటర్ ఏంటబ్బా? ఈ చిత్ర దర్శకుడు ఉపేంద్ర మాధవ్ మాట్లాడుతూ టైటిల్ చూసి ఇదేదో పొలిటికల్ సినిమా అని అస్సలు అనుకోవద్దు. ఇది ఒక పక్కా ఫామిలీ ఎంటర్టైనర్. మొదటి హాఫ్ కార్పొరేట్ బాక్ గ్రౌండ్ - రెండో హాఫ్ రూరల్ బాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా అందరిని నవ్విస్తుందని కాన్ఫిడెంటుగా చెబుతున్నాడు. మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తి అయిపోయాయట.. ఈ నెల 15న సెన్సార్ పనులు కూడా పూర్తయిపోతే సినిమా 23న విడుదలకు సిద్దంగా ఉంటుందట.

ఒక ప్రక్కన మార్చ 30న రంగస్థలం ఉన్నా కూడా.. ఆ తరువాత వరుసగా ఇంకా పెద్ద సినిమాలు ఉన్నా కూడా.. కళ్యాణ్‌ రామ్ మాత్రం ధైర్యంగా రంగంలోకి దిగేస్తున్నాడు. పటాస్ తరువాత మరోసారి ఆ స్థాయి విజయాన్ని నమోదు చేసుకోవడంలో చతికిలపడిన ఈ నందమూరి హీరో.. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. మండే సమ్మర్లో మంచు బొట్టులా హాయిని కలిగిస్తాడా? లెటజ్ సీ.