Begin typing your search above and press return to search.
కళ్యాణ్ రామ్ తర్వాత ఎవరితో అంటే..
By: Tupaki Desk | 9 Nov 2015 6:21 AM GMT‘పటాస్’ సినిమాతో వచ్చిన డబ్బులు - పేరు.. రెండింటినీ ఏడాది తిరిగేలోపే పోగొట్టుకున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ‘కిక్-2’ డబ్బు పోగొడితే.. ‘షేర్’ పేరు చెడగొట్టింది. మళ్లీ ఎప్పట్లాగే జంక్షన్ లో నిలబడి ఎటు పోవాలో తెలియనివాడిలా అయోమయంలో పడిపోయాడు కళ్యాణ్ రామ్. ఐతే ఆ అయోమయం నుంచి కాస్త త్వరగానే కోలుకుని తన తర్వాతి సినిమాకు రంగం సిద్ధం చేసుకున్నాడు నందమూరి హీరో. కళ్యాణ్ తర్వాతి సినిమాను ఎ.ఎస్.రవికుమార్ చౌదరి డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం.
ఒకప్పుడు ‘యజ్నం’ లాంటి సర్ ప్రైజ్ హిట్టిచ్చి బాలయ్యతో ‘వీరభద్ర’ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు చౌదరి. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత తీసిన సినిమాలన్నీ దెబ్బ కొట్టేశాయి. అందరూ అతడి పేరు మరిచిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు గోపీచంద్ తో ‘సౌఖ్యం’ తీస్తున్నాడు. దీని తర్వాత కళ్యాణ్ రామ్ తో సినిమా చేయడం కోసం ఓ కథ సిద్ధం చేశాడు. ఈ మధ్యే స్క్రిప్టు కళ్యాణ్ కు నరేట్ చేయగా.. అతను ఓకే చెప్పాడట. ఈ సినిమాను తనే స్వయంగా నిర్మించబోతున్నాడు కూడా. త్వరలోనే అనౌన్స్ మెంట్ రాబోతోంది.