Begin typing your search above and press return to search.
కళ్యాణరాముని కల ఈసారైనా నెరవేరేనా?
By: Tupaki Desk | 14 July 2019 6:16 AM GMTవరుసగా ఒకదాని వెంట ఒకటిగా సినిమాల్లో నటిస్తూ స్పీడ్ పెంచారు కళ్యాణ్ రామ్. 118 తర్వాత మరింత దూకుడు పెంచారు. జయాపజయాలతో పని లేకుండా కథ నచ్చితే చాలు క్రేజీగా ప్రాజెక్టులను పరుగు పెట్టిస్తున్నాడు. కొన్ని ప్రయోగాలు.. మరికొన్ని రెగ్యులర్ కథలు అయినా ఓకే చెబుతున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న `తుగ్లక్` ప్రయోగాత్మక స్క్రిప్టుతో తెరకెక్కుతున్న వైవిధ్యమైన సినిమా అని చెబుతున్నారు. దీంతో పాటే ఫ్యామిలీ కంటెంట్ డ్రివెన్ డైరెక్టర్ సతీష్ వేగేష్నతో ఓ సినిమా చేస్తున్నారు కళ్యాణరాముడు.
ఈ రెండు సినిమాల తర్వాత మాస్ డైరెక్టర్ సంపత్ నందితో పని చేస్తారని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే ఇంతకీ ఆ సినిమా పనులు ఎంతవరకూ వచ్చాయి? అంటే తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటికే ఈ సినిమాకి కథ ఓకే అయ్యింది. కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారరని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టులో తుది మెరుగులతో పాటు.. కాస్టింగ్ ఎంపికలు- ఇతరత్రా ప్రీప్రొడక్షన్ ప్లాన్ చేస్తున్నారట. ఎప్పుడు మొదలవుతుంది? నటీనటులు- టెక్నీషియన్లు ఎవరు తదితర విషయాల్ని అధికారికంగా వెల్లడించేందుకు రెడీ అవుతున్నారట.
సంపత్ నంది అంటే పక్కా మాస్ సినిమాల స్పెషలిస్ట్. రామ్ చరణ్ - రచ్చ .. రవితేజ - బెంగాల్ టైగర్ ఈ తరహానే. హీరోలోని పూర్తి ఎనర్జీని ఉపయోగించి ఎనర్జటిక్ మాస్ కంటెంట్ తో సినిమాల్ని తెరకెక్కించిన ట్రాక్ అతడికి ఉంది. అయితే గోపిచంద్ తో `గౌతమ్ నందా` ఫెయిలవ్వడం పెద్ద మైనస్ అయ్యింది. అటుపై నిర్మాతగా కొన్ని మాస్ ఎనర్జిటిక్ సినిమాలు తీసే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం తిరిగి దర్శకుడిగా సత్తా చాటేందుకు ట్రై చేస్తున్నాడు. సంపత్ ఈసారి ఎలాంటి స్క్రిప్టును ఎంచుకున్నాడు? పటాస్ అంత పెద్ద హిట్టు కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ కల నెరవేరుస్తాడా.. లేదా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.