Begin typing your search above and press return to search.

అప్పుడే ఆశలు వదిలేశారా?

By:  Tupaki Desk   |   7 Jun 2018 10:33 AM IST
అప్పుడే ఆశలు వదిలేశారా?
X
సినిమాకు రిలీజ్ కు ముందు మంచి బజ్ రావడమంటే నిజంగా లక్కీయే. కాస్తంత ప్రమోషన్ తో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయవచ్చు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన నా నువ్వే సినిమాకు మొదట్లో ఈ లక్ కలిసొచ్చింది. కళ్యాణ్ రామ్ లుక్ చాలా కొత్తగా ఉండటం.. సినిమా సాంగ్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉండటం.. మ్యూజిక్ వండర్ ఫుల్ గా ఉందనే టాక్ రావడం నా నువ్వే సినిమాకు బజ్ తెచ్చింది.

ముందు ఈ సినిమాను మే 25న రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. దానికన్నా చాలా ముందు నుంచే ప్రమోషన్స్ మొదలెట్టారు. తీరా సినిమాపై మంచి ఆసక్తి క్రియేట్ అయిన టైంకు గ్రాఫిక్ వర్క్ అవలేదంటూ వాయిదా వేశారు. ఇప్పుడు జూన్ మూడో వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ టైంకు దగ్గర పడుతున్నా ఈ సినిమా ప్రమోషన్ల జాడే కనిపించడం లేదు. ఇంతకు ముందున్న బజ్ కూడా ఇప్పుడు కనిపించడం లేదు. సినిమా టీం కానీ.. యాక్టర్లు కూడా ఏమీ పట్టించుకోనట్టే ఉండిపోతున్నారు.

సరైన ప్రమోషన్ లేకపోతే ఎంత మంచి సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం కష్టం. అలాంటిది నా నువ్వే మొదట్లో చేసిన ప్రమోషన్లలో ఇప్పుడో పదో వంతు కూడా చేయకపోవడం ఇండస్ట్రీ జనాలను ఆశ్చర్యపరుస్తోంది. సినిమా యూనిట్ తీరు చూస్తుంటే ఆత్మవిశ్వాసంలా కాకుండా ఆశలు వదిలేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎంత ఆలస్యమైనా మరీ ఇంత నీరసమా?