Begin typing your search above and press return to search.

కళ్యాణ్‌ రామ్‌ కోరిక తీరకుండానే..!

By:  Tupaki Desk   |   29 Aug 2018 9:32 AM GMT
కళ్యాణ్‌ రామ్‌ కోరిక తీరకుండానే..!
X
హరికృష్ణ మరణంతో నందమూరి ఫ్యామిలీ శోక సంద్రంలో మునిగి పోయింది. ముఖ్యంగా హరికృష్ణ కొడుకు కళ్యాణ్‌ రామ్‌, ఎన్టీఆర్‌లు కన్నీరు మున్నీరు అయ్యారు. నాలుగు సంవత్సరాల క్రితం అన్నయ్య జానకి రామ్‌ను కోల్పోయిన వీరు చాలా తక్కువ సమయంలోనే తండ్రి హరికృష్ణను కూడా కోల్పోవడంతో దుఖ: ఆపుకోలేక పోతున్నారు. కొన్ని సంవత్సరాల ముందు వరకు ఎన్టీఆర్‌ తో హరికృష్ణ మరియు కళ్యాణ్‌ రామ్‌లు సన్నిహితంగా ఉండే వారు కాదు. కాని ఈమద్య కాలంలో అన్నదమ్ములు చాలా ఆప్యాయంగా ఉండటంతో పాటు, పలు కార్యక్రమాల్లో తండ్రితో పాటు కనిపించి ఫ్యాన్స్‌ కు కనువిందు చేశారు. ఈ సమయంలోనే కళ్యాణ్‌ రామ్‌ ఒక కోరిక కోరుకున్నాడు.

తమ్ముడు ఎన్టీఆర్‌ - తండ్రి హరికృష్ణలతో ఒక చిత్రాన్ని నిర్మించాలని, ఆ చిత్రంలో తాను కూడా నటించాలని కళ్యాణ్‌ రామ్‌ కు చాలా కాలంగా ఉంది. ఆ విషయాన్ని కొన్నాళ్ల క్రితం ఒక సినిమా ప్రమోషన్‌ లో భాగంగా చెప్పడం జరిగింది. తన సన్నిహిత రచయితలతో కథను సిద్దం చేయమంటూ చెప్పడం కూడా జరిగింది. ఇంతలోనే హరికృష్ణ మృతి చెందడంతో కళ్యాణ్‌ రామ్‌ షాక్‌ కు గురయ్యాడు. తండ్రిపై చాలా అభిమానంను కురిపించే ఎన్టీఆర్‌ కూడా తండ్రితో నటించాలని ఆశపడ్డాడు.

నందమూరి ఫ్యాన్స్‌ కూడా ఈ ముగ్గురు నటిస్తే చూడాలని కోరుకున్నారు. కొన్నాళ్ల క్రితం హరికృష్ణ అనారోగ్య కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఈమద్య ఆరోగ్యం కుదుట పడటంతో మళ్లీ సినిమాలపై హరికృష్ణకు గాలి మల్లిందని ఈమద్య ప్రచారం జరిగింది. హరికృష్ణ ఖచ్చితంగా త్వరలో మళ్లీ వెండితెరపై కనిపించడం ఖాయం అనుకుంటున్న సమయంలో ఇలా జరిగిందని సినీ వర్గాల వారు కూడా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హరికృష్ణ మృతి కళ్యాణ్‌ రామ్‌ - ఎన్టీఆర్‌ లకు చాలా పెద్ద లోటు.