Begin typing your search above and press return to search.

బాబాయి కాకుంటే ఒప్పుకునేవాడిని కాదు

By:  Tupaki Desk   |   7 Jan 2019 2:30 PM GMT
బాబాయి కాకుంటే ఒప్పుకునేవాడిని కాదు
X
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ మూవీ విడుదలకు సిద్దం అయ్యింది. మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రంకు బాలయ్య అండ్‌ టీం విభిన్నమైన ప్రమోషన్‌ ను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటించిన బాలకృష్ణతో పాటు కళ్యాణ్‌ రామ్‌ - సుమంత్‌ - రానా ఇంకా ఇతర నటీనటులంతా కలిసి చర్చించుకుంటూ చిత్రంకు సంబంధించిన ఆసక్తికర విషయాలను - చిత్రంలోని తమ పాత్రను - తమకు పాత్ర వచ్చిన విధానంను - నటించిన తీరును రకరకాలుగా చెబుతూ వచ్చారు.

ఆ ప్రమోషన్‌ ఇంటర్వ్యూలో కళ్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ.. బాబాయి సినిమాతో 30 ఏళ్ల క్రితం తెలుగు సినిమాకు పరిచయం అయ్యాను. మళ్లీ ఇన్నాళ్లకు బాబాయి సినిమాలో నటించాను. బాబాయి నిర్మాణంలో నటించడం చాలా సంతోషంగా ఉంది. బాబాయి నిర్మాణంలో కాకుండా మరెవ్వరి నిర్మాణంలో అయినా ఈ పాత్రను చేయక పోయేవాడిని. నాన్నగారు 20 ఏళ్ల వయస్సులో ఎలా ఉండేవారో నాకు తెలియదు. బాబాయి నాన్నగారు ఎలా ఉండేవారో చెప్పేవారు, ఆయన చెప్పినట్లుగా నేను ఈ పాత్రను చేశాను.

నాకు పదేళ్ల వయస్సు వచ్చే వరకు నాన్నగారిని ఎక్కువగా చూసింది లేదు. పొద్దున్నే మూడు గంటలకే వారి నాన్నగారితో బయటకు వెళ్లి పోయేవారు, రాత్రి పొద్దు పోయిన తర్వాత వచ్చేవారు. రాత్రి నేను 8 గంటలకే పడుకోవడం వల్ల నాన్నను చూసే అవకాశం ఉండేది కాదు. అలాంటి నాన్నగారి పాత్రను ఈ సినిమాలో పోషించడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. ఈ చిత్రంలో నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతను కూడా నెత్తికి ఎత్తుకోవడం బాబాయి పెద్ద బాధ్యతను మోయడంతో సమానమంటూ కళ్యాణ్‌ రామ్‌ పేర్కొన్నాడు.

ఈ చిత్రం గురించి క్రిష్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఏయన్నార్‌ పాత్రను పోషించేందుకు క్రిష్‌ చాలా ఉత్సాహం చూపించాడు. ఈ చిత్రంలో దివిసీమ తుఫాన్‌ సీన్‌ కోసం వెయిట్‌ చేస్తున్నానంటూ సుమంత్‌ ఎప్పుడు అంటూ ఉండేవాడు. ఆ సీన్‌ ఎన్టీఆర్‌ మరియు ఏయన్నార్‌ లతో బాగుంటుందని క్రిష్‌ చెప్పుకొచ్చాడు. నిమ్మకూరుకు చెందిన సాధారణ అమాయకత్వపు ఒక వ్యక్తి తెలుగు జాతి మొత్తం గర్వించేలా కథానాయకుడు - ఆ తర్వాత మహానాయకుడు ఎలా అయ్యాడనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా క్రిష్‌ చెప్పుకొచ్చాడు.