Begin typing your search above and press return to search.

బింబిసారుడి ప్రజా దర్బార్ ప్రోమో.. పాన్ ఇండియా రిలీజ్ పై కళ్యాణ్ రామ్ క్లారిటీ..!

By:  Tupaki Desk   |   3 Aug 2022 2:36 PM GMT
బింబిసారుడి ప్రజా దర్బార్ ప్రోమో.. పాన్ ఇండియా రిలీజ్ పై కళ్యాణ్ రామ్ క్లారిటీ..!
X
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'బింబిసార' సినిమా ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. వశిష్ఠ్ అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్.. ఈ సినిమా సాలిడ్ బజ్ క్రియేట్ చేయడానికి సహాయపడింది.

గత కొన్ని రోజులుగా దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్న కళ్యాణ్ రామ్.. 'బింబిసార' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకూ ప్రచార కార్యక్రమాలు చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే యాంకర్ సుమ తో రాయల్ 'తింటర్యూ' పేరుతో చేసిన ఇంటర్వ్యూ అలరించగా.. లేటెస్టుగా మరో భిన్నమైన ఇంటర్వ్యూతో వస్తున్నారు.

'బింబిసారుడి ప్రజా దర్బార్' పేరుతో యూట్యూబర్స్ తో కలిసి కళ్యాణ్ రామ్ ఓ ప్రోగ్రామ్ చేశారు. ఇందులో శ్రీనివాస రెడ్డి కూడా భాగం పంచుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని చిత్ర బృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. యూట్యూబర్స్ అడిగే చిలిపి ప్రశ్నలకు కింగ్ బింబిసార సమాధానాలు ఇచ్చేలా ప్లాన్ చేసిన ఈ ఇంటర్వ్యూ ఫన్నీగా ఉంది.

'బింబిసారుడి ప్రజా దర్బార్' ఫుల్ ఇంటర్వ్యూ రేపు గురువారం ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఏదేమైనా కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అర్థం అవుతుంది. చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నందమూరి హీరో.. ఇప్పుడు ప్రమోషన్స్ తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తునన్నాడు. మరి ఇవి సినిమా విజయానికి ఏ మేరకు దోహదపడతాయో చూడాలి.

'బింబిసార' అనే కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో కూడిన సోషల్ ఫాంటసీ యాక్షన్ సినిమా కావడంతో.. భారీ బడ్జెట్ తో విజువల్ గ్రాండియర్ గా తీర్చుదిద్దారు. బిగ్ స్కేల్ లో రూపొందించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తారని అందరూ భావించారు.

ఇటీవల కాలంలో ప్రతీ సినిమాని మల్టీ లాంగ్వేజెస్ లో విడుదల చేస్తున్న నేపథ్యంలో.. 'బింబిసార' ను కూడా నాలుగు దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ముందుగా భావించారట. చివరి నిమిషంలో ఆ నిర్ణయం మార్చుకొని కేవలం తెలుగులోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక్కడ ఫ‌లితాన్ని బ‌ట్టి మిగిలిన భాష‌ల్లో డ‌బ్ చేసి విడుదల చేయనున్నట్లు క‌ల్యాణ్ రామ్ స్వ‌యంగా వెల్ల‌డించారు.

కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. 'బింబిసార' ఇప్పుడు తెలుగులో మాత్ర‌మే రిలీజ్ అవుతోంది. మా సినిమాకి తెలుగులో జ‌రిగిన బిజినెస్ ప‌రంగా సంతృప్తిగా ఉన్నాం. ఇక్కడి రిజ‌ల్ట్ ని బ‌ట్టి, రెండు వారాల్లోనే మిగతా భాషల్లో విడుద‌ల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు వశిష్ట ఇదే విషయం మీద స్పందిస్తూ.. తమ దగ్గర అంత సమయం లేదని.. పాన్ ఇండియా రిలీజ్ అంటే చాలా ప్రమోషన్స్ చేస్తూ తిరగాల్సి ఉంటుందన్నారు.

కాగా, 'బింబిసార' చిత్రంలో కళ్యాణ్ రామ్ రెండు పాత్రల్లో అలరించనున్నారు. త్రిగర్తల చక్రవర్తి బింబిసారుడిగా మరియు మోడ్రన్ యువకుడిగా కనిపించనున్నారు. కేథరిన్ థ్రెసా మరియు సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. చిరంతన్ భట్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.