Begin typing your search above and press return to search.
నాకో అన్నయ్య దొరికాడు.. కాజల్ సెంచరీ
By: Tupaki Desk | 21 March 2018 4:33 AM GMTఎమ్మెల్యే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ ప్రతీ వ్యక్తినీ పేరు పేరునా స్టేజ్ పైకి పిలిచి ప్రశంసించడం ఆకట్టుకుంది. డిజైనర్స్ ను కూడా స్టేజ్ పైకి పిలిచి కరచాలనం చేసి.. థ్యాంక్స్ చెప్పాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాలో నటించిన యాక్టర్స్ అందరూ.. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేలా నటించారని చెప్పాడు కళ్యాణ్ రామ్.
'భోజ్ పురిలో రవికిషన్ ఓ సూపర్ స్టార్. మన ఇండస్ట్రీలో ప్రతినాయక పాత్రలు చేస్తున్నాడు. వేరే భాషలో సూపర్ స్టార్ అయుండి.. ఈ పాత్రలు ఎందుకు అని అఢిగితే.. కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి అని చెప్పాడు. ఇప్పటికి 500 సినిమాలు చేసిన ఆయన ఇంకేం నేర్చుకోవాలో అర్ధం కాలేదు. నాకు ఓ మంచి అన్నయ్య దొరికాడు. ఆయన నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య' అంటూ రవికిషన్ ను ప్రశంసించిన కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో మీరు కొత్త కళ్యాణ్ రామ్ ను చూస్తారు అంటూ ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచాడు.
'దర్శకుడికి రెండో పెళ్లాం లాంటి వ్యక్తి ఎడిటర్. ఈ సినిమాకు తమ్మి రాజు ఎడిటర్. సినిమాలో ఏదైనా వేస్ట్ షాట్ ఉంటే నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తానంటాడు. ఎక్కడైనా నేను కాస్త నీరసంగా కనిపిస్తే 'ఏం సార్ ఇలా చేస్తున్నారు.. కొంచెం బాగా చేయండి..' అనేస్తారు. ఎడిటింగ్ రూంలో దర్శకుడితో చాలాసార్లే గొడవలు పెట్టేసుకున్నారు. కొంచెం కూడా బోర్ అనిపించకుండా సినిమా ఉంటుందంటే.. అది ఎడిటర్ ప్రతిభే' అన్నాడు కళ్యాణ్ రామ్
కళ్యాణ్ రామ్ మూవీ లక్ష్మీ కళ్యాణంతో కాజల్ అగర్వాల్ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. 'నేను ఇప్పటికి 14 సినిమాలే చేశాను.. నువ్వేంటి అప్పుడే 50 సినిమాలు చేసేశావ్ అని కాజల్ ను అడుగుతూ అంటాను. మళ్లీ 12 ఏళ్ల తర్వాత ఆమెతో సినిమా చేస్తున్నా.. అప్పుడెలా ఉందో వ్యక్తిగతంగా ఇప్పుడూ అలాగే ఉంది. ఈ 12 ఏళ్లలో ప్రొఫెషనల్ గా ఎదిగింది. ఓ సీన్ చెబితే దాన్ని ఇంకా బాగా ఎలా చేయాలో చెప్పే స్థాయికి ఎదిగింది. ఆమె మరో 50 సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను' అన్నాడు కళ్యాణ్ రామ్.
'అల్లరి నరేష్ ను మాత్రమే నేను బాబాయ్ అని పిలుస్తాను. ఇండస్ట్రీలో బాబాయ్ అని నేను పిలిచే ఒకే వ్యక్తి ఆయన. గతంలో రోజూ కలిసే వాళ్లం. పెళ్లి తర్వాత నేనే కలవడం మానేశాను. సారీ బాబాయ్. తన ఆడియో ఫంక్షన్ దేనికైనా ఫస్ట్ పిలుపు నాకే ఇస్తాడు. కానీ నేను వెళ్లలేదు. ఈ సారి బాబాయ్ ఆడియో ఫంక్షన్ ఏది జరిగినా సరే నేను కచ్చితంగా అటెండ్ అవుతాను' అంటూ అల్లరి నరేష్ గురించి చెప్పాడు నందమూరి హీరో.