Begin typing your search above and press return to search.
టీడీపీలో జాయిన్ అవుతారా ప్రశ్నకి కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఇదే
By: Tupaki Desk | 2 Aug 2022 8:39 AM GMTనందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ వారంలో రాబోతున్న బింబిసార సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో కళ్యాణ్ రామ్ గత రెండు వారాలుగా బిజీ బిజీగా ఉన్నాడు. పదుల కొద్దీ ఇంటర్వ్యూలు ఇస్తూ.. ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాను సాధ్యం అయినంత ఎక్కువగా ప్రమోట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు.
తాజాగా ఒక మీడియా సంస్థ తో బింబిసార గురించి మాట్లాడుతున్న సమయంలో రిపోర్టర్ మాట్లాడుతూ.. మీకు తెలుగు దేశం పార్టీ నుండి ఆహ్వానం అందితే జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారా.. యాక్టివ్ పాలిటిక్స్ విషయంలో మీ అభిప్రాయం ఏంటీ అన్నట్లుగా ప్రశ్నించిన సమయంలో కళ్యాణ్ రామ్ కుండ బద్దలు కొట్టినట్లుగా సమాధానం ఇచ్చాడు.
కళ్యాణ్ రామ్ ఆ ప్రశ్నకు స్పందిస్తూ.. రెండు పడవల ప్రయాణం చేయాలని నేను అనుకోవడం లేదు. ప్రస్తుతానికి నా పూర్తి దృష్టి సినిమాలపైనే ఉంది. ఒక వేళ నేను రాజకీయాల్లో అడుగు పెడితే అప్పుడు సినిమాలను వదిలేస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. దాంతో ఆయన ప్రస్తుతానికి టీడీపీలో చేరే విషయం పై ఆసక్తి లేడని క్లారిటీ వచ్చింది.
గతంలో ఎన్టీఆర్ కూడా కాస్త అటు ఇటుగా ఇదే సమాధానం చెప్పారు. గతంలో టీడీపీకి ప్రచారం చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత టీడీపీ పేరును కూడా ఎత్తకుండా రాజకీయాలకు దూరం అన్నట్లుగా ఉంటున్నాడు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా పూర్తి దృష్టి సినిమాల మీదే అనేశాడు.
బింబిసార సినిమా పై చాలా నమ్మకంతో కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు. దాదాపుగా ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ రూ.40 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.
కళ్యాణ్ రామ్ గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడం వల్ల సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.