Begin typing your search above and press return to search.
అయ్యో.. నందమూరి నామ సంవత్సరం
By: Tupaki Desk | 31 Oct 2015 7:30 PM GMTనందమూరి నామ సంవత్సరం.. 2015 ప్రారంభంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నోటి వెంట వచ్చిన ఈ డైలాగ్.. ఈ ఏడాది మొత్తానికే బెస్ట్ అని చెప్పాలి. నందమూరి అభిమానులు పండగ చేసేసుకున్నారు ఈ మాట విని. కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ ఆడియో వేడుక ఫంక్షన్ లో ఎన్టీఆర్ ఈ డైలాగ్ చెప్పాడు.
యంగ్ టైగర్ చెప్పినట్లుగానే.. పటాస్ బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత వంతు ఎన్టీఆర్ ది. పూరి డైరెక్షన్ లో టెంపర్ అంటూ వచ్చి.. తన రికార్డుల వరకూ బ్రేక్ చేశాడు. ఈ రెండు సినిమాలు ఆశించినట్లుగానే హిట్ కావడంతో.. తర్వాత వచ్చే నందమూరి ఫ్యామిలీ సినిమాలన్నీ కూడా ఇలాగే హిట్ అవుతాయని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. టెంపర్ తర్వాత బాలయ్య లయన్ అంటూ వచ్చినా గర్జించడం సాధ్యం కాలేదు. సమ్మర్ హాలిడేస్ సీజన్ లో వచ్చినా.. ఫ్లాప్ గా మిగిలింది లయన్. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నిర్మాతగా తీసిన కిక్ 2 పరిస్థితి కూడా ఇదే. రవితేజ లాంట్ మాస్ మహరాజా, రేసుగుర్రం తీసిన సురేందర్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్నా డిజాస్టర్ అనిపించుకుంది కిక్2.
ఇప్పుడు మళ్లీ షేర్ అంటూ వచ్చాడు కళ్యాణ్ రామ్. మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ మొదలైపోయింది ఈ మూవీకి. ఇక ఈ ఏడాది రిలీజయ్యే నందమూరి ఫ్యామిలీ సినిమాలేం లేవు. నందమూరి నామ సంవత్సరం ఆశించిన స్థాయిలో కిక్ ఇవ్వలేకపోయింది అభిమానులకు అని చెప్పచ్చు.