Begin typing your search above and press return to search.

'బింబిసార' పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న నందమూరి హీరో..!

By:  Tupaki Desk   |   3 Aug 2022 3:30 PM GMT
బింబిసార పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న నందమూరి హీరో..!
X
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ''బింబిసార''. వశిష్ట మల్లిడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చరిత్రకు వర్తమానానికి లింక్ చేస్తూ టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో సోషియో ఫాంటసీ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఆగస్ట్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలోకి రాబోతోంది.

'బింబిసార' నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా పవర్ ఫుల్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు. అహంకారభావాలు కలిగిన ఉన్న ఒక క్రూరమైన రాజు టైం ట్రావెల్ చేసి చారిత్రక యుగం నుంచి ప్రస్తుతానికి వచ్చి మంచి మనిషిగా ఎలా మారాడు? అనే పాయింట్ ను ఈ సినిమాలో చూపించబోతున్నారు.

ఇది కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రంగా పేర్కొనవచ్చు. అత్యున్నత సాంకేతికతో రూపొందించారు. ఎప్పటి నుంచో చారిత్రక నేపథ్యం ఉన్న కథలో నటించాలని ఎదురు చూస్తున్న నందమూరి హీరో.. ఇప్పుడు సరైన కథ దొరకడంతో 'బింబిసార' సినిమా చేసినట్లు చెబుతూ వస్తున్నారు.

బింబిసార చిత్రాన్ని 135 రోజులపాటు చిత్రీకరించారు. ఇందులో తన పాత్ర కోసం కళ్యాణ్ రామ్ చాలా కష్టపడ్డారు. రెగ్యులర్ గా వర్కవుట్స్ 13 కేజీల బరువు తగ్గారు. 'ఎంత మంచివాడవురా' వంటి పరాజయం తర్వాత రాబోతున్న ఈ మూవీపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అలానే ఈ సినిమా ఫలితం పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం కళ్యాణ్ రామ్ తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల స్క్రీనింగ్‌ తో తన సినిమాని ప్రారంభించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది చాలా డేరింగ్ స్టెప్ అని చెప్పాలి. అలానే 'బింబిసార' సినిమాపై హీరో ఎంత నమ్మకంగా ఉన్నాడనే విషయాన్ని తెలుస్తోంది. ఈ మూవీతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ అందుకుంటారని నందమూరి అభిమానులు ధీమాగా ఉన్నారు.

'బింబిసార' సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్ థ్రెసా - సంయుక్త మీనన్ లు కథానాయికలుగా నటించారు. వారీనా హుస్సేన్ - వెన్నెల కిషోర్ - బ్రహ్మాజీ - శ్రీనివాస రెడ్డి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంతన్ భట్ సంగీతం సమకూర్చగా.. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

ఇటీవల కాలంలో విడుదలైన తెలుగు సినిమాలేవీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' సినిమాపై అందరి దృష్టి పడింది. మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ కు సక్సెస్ అందించి.. టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊపు తీసుకొస్తుందేమో చూడాలి.