Begin typing your search above and press return to search.
ప్రయత్నిస్తూనే ఫెయిలవుతున్నా!- కల్యాణ్ రామ్
By: Tupaki Desk | 25 Feb 2019 4:13 PM GMTకల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం `118`. ఈ సినిమా ద్వారా టాప్ కెమెరామెన్ కె.వి.గుహన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ జోనర్ లో కల్యాణ్ రామ్ తొలిసారి చేస్తున్న సినిమా ఇది. కావడం, ట్రైలర్ అందుకు తగ్గట్లే కొత్తగా వుండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక ఈ రోజు (సోమవారం) హైదరాబాద్ జేఆర్‌సీలో జరిగింది. ఈ కార్యక్రమంలో కల్యాణ్‌రామ్‌తో పాటు నందమూరి బాలకృష్ణ - ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ సినిమా గురించి మాట్లాడిన కల్యాణ్ రామ్ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించడం ఆసక్తికంగా మారింది. `నాకు ఈ సినిమాపై పూర్తి నమ్మకం వుంది. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రతిసారి కొత్తదనంతో మీ ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నాను. కానీ ఫెయిల్ అవుతున్నాను. ఆ విషయం నాకు కూడా తెలుస్తోంది.. కానీ మిమ్మల్ని మెప్పించే వరకు ప్రయత్నిస్తూనే వుంటా`` అని ఆసక్తికరంగా మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఫెయిల్యూర్ గురించి ఏ హీరో అంత తేలిగ్గా అంగీకరించరు. కానీ కళ్యాణ్ రామ్ ఈ విషయంలో ఎంతో నిజాయితీని ప్రదర్శించడం ఆసక్తికరం. ఇటీవలే మీడియా ఇంటర్వ్యూలోనూ తన గత చిత్రాల వైఫల్యాల గురించి అంగీకరించారు. ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నను పదే పదే గుర్తు చేస్తూ.. అవును నిజమే ఫెయిలవుతున్నా.. కానీ ఈసారి జాగ్రత్తగా ఎటెంప్ట్ చేశా. సక్సెసవుతానని అన్నారు. మార్చి 1న 118 చిత్రం రిలీజవుతున్న సంగతి తెలిసిందే.