Begin typing your search above and press return to search.
మా బాబాయ్ ఆ లోటు తీర్చేశాడు
By: Tupaki Desk | 21 Oct 2018 4:34 PM GMTఅరవింద సమేత సక్సెస్ వేదిక ఆద్యంతం రక్తి కట్టించారు నందమూరి హీరోలు. శిల్పకళావేదికకు బాబాయ్ రాకతో అబ్బాయిల్లో ఒకటే ఆనందం కనిపించింది. ఆ ఉత్సాహంలో కళ్యాణ్ రామ్ అసలైన స్పిరిట్ ని ఆవిష్కరించారు. ``అరవింద సమేత ఎట్టా ఉన్నది? మన వీర రాఘవుడు ఎట్టా సేసినాడు?`` అంటూ సీమ యాసలో ఉత్సాహం పెంచారు. సినిమా చూసినప్పుడు రాయలసీమ స్లాంగ్ తమ్ముడి నోటి నుంచి వింటుంటే అక్కడే పుట్టి పెరిగిన వాడి అథారిటీ కనిపించింది... అంటూ పొగిడేశాడు కల్యాణ్ రామ్. ఇంత అద్బుతమైన సినిమాని అందించారు త్రివిక్రమ్. ఎంటర్ టైన్ మెంట్ జోనర్ తీసే ఆయన ఫస్ట్ టైమ్ ఫుల్ ఎమోషనల్ సినిమా చూపించారు.. అని అన్నారు.
తమ్ముడే కాదు - ప్రతి ఒక్కరూ ఈ చిత్రంలో వాళ్ల పాత్రల్లో జీవించేశారు. సినిమా చూశాక తొలిసారి కంగ్రాట్స్ చెప్పింది తమన్ కే. నేను ఇళయరాజాకి గొప్ప ఫ్యాన్ ని. తొలిసారి ఇళయరాజా ఫీల్ తో మ్యూజిక్ ఇచ్చాడు తను.. అని పొగిడేశాడు. బాలయ్య బాబాయ్ గురించి ప్రస్థావిస్తూ.. ఎంతో బిజీ షెడ్యూల్స్ లో ఉండీ... ఎన్టీఆర్ బయోపిక్ కోసం డే అండ్ నైట్ పనిచేస్తున్నారు బాబాయ్. రెండు భాగాల్లో నటించాలి. అడగ్గానే మా ఆనందాన్ని అభిమానులతో పంచుకోవడానికి వచ్చారు బాబాయ్. ఆయనకు థాంక్స్.. అనీ అన్నారు. వేదికపై ఒకటే లోటు.. నాన్నగారు ఇక్కడ ఉంటే బావుండేది. ఎప్పుడూ వెలితిగా ఉండేది. ఈసారి మన బాలయ్య .. మా బాబాయ్ ఆ లోటు తీర్చేశాడు.. అంటూ ఆనందం వ్యక్తం చేశాడు కల్యాణ్ రామ్.
ప్రతినాయకుడు కాదు.. ఆయన మా ఫ్యామిలీ మెంబర్ జగపతిబాబు. ఆ పాత్రలో ఆయన కాకుండా ఎవరినైనా ఊహించగలమా.. ఆ పాత్ర అంత బలంగా పండింది. అందుకే సినిమా అంతపెద్ద విజయం సాధించిందని జగపతిని కల్యాణ్‌రామ్ పొగిడేశారు.