Begin typing your search above and press return to search.

మీ ఆకలి తీరిందా?? -కళ్యాణ్‌ రామ్

By:  Tupaki Desk   |   13 Sep 2016 5:23 PM GMT
మీ ఆకలి తీరిందా?? -కళ్యాణ్‌ రామ్
X
''గత మూడేళ్లనుండి.. గూబ గుయ్ అనేలా ఎప్పుడు కొడతాం.. అని ప్రతీరోజూ అనుకునేవారం. ఇన్నాళ్లకు కుదిరింది. మీరందరూ అందించారు'' అంటూ జనతా గ్యారేజ్ సక్సెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు నందమూరి కళ్యాణ్‌ రామ్. తమ్ముడు హిట్టు కొట్టిన సందర్భంలో.. ఈ రేంజులో చాలా ఎక్సయిటింగ్ స్పీచ్ ఇచ్చాడు. అభిమానులను ఉర్రూతలూగించాడు.

''నాది మా తమ్ముడిది ఆకలి తీరింది. మీ ఆకలి తీరిందా?'' అని కళ్యాణ్‌ రామ్ అడగటంతో అభిమానులు అనందంలో మునిగిపోయారు. ''ఆడియో ఫంక్షన్ కు నేను లేను. చాలా బాధేసింది. తమ్ముడు ఒక్కడే ఉన్నాడేమో అనుకున్నా. కాని నేను లేకపోతే ఏముంది.. మీరందరూ ఉన్నారుగా. హ్యాపీగా ఫీలయ్యా'' అని చెబుతూ.. తాను ఆడియో ఫంక్షన్ కు రాలేకపోయానని తెలిపాడు. ఈ సినిమాను అందించిన కొరటాల శివకు.. ఇతర టెక్నీషియన్లకు అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు.

ఇక స్టేజీ మీద నుండి బయలుదేరుతూ.. ''నానా పండగ చేస్కుందాం.. పార్టీ చేస్కుందాం'' అంటూ ఎన్టీఆర్ ను నవ్వుల్లో ముంచేసి సెలవు తీసుకున్నాడు కళ్యాణ్‌ రామ్.