Begin typing your search above and press return to search.
నాన్నగా అభినయించాలనుకుంటే!
By: Tupaki Desk | 29 Aug 2018 3:46 AM GMTప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాని వారాహి చలనచిత్రం - విబ్రి మీడియాతో కలిసి బాలకృష్ణ సొంత బ్యానర్ ఎన్ బికే ఫిలింస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రానా - ప్రకాష్ రాజ్ - కీర్తి సురేష్ - రకుల్ ప్రీత్ సింగ్ - సుమంత్ - మురళి వర్మ - మాంజిమ వంటి నటీనటుల్ని కీలక పాత్రల కోసం ఎంపిక చేసుకున్నారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోంది.
ఈ సినిమాలో ఇతరత్రా కీలక పాత్రలకు సంబంధించిన ఎంపికలు సాగుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్ చైతన్య రధసారథి - ఆయన రాజకీయ జీవితంలో ఎంతో కీలకమైన హరికృష్ణ పాత్రధారి కోసం దర్శకుడు క్రిష్ & టీమ్ వేచి చూస్తున్నారు. అయితే నందమూరి కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటిస్తారన్న చర్చ సాగుతోంది. ఆ విషయాన్ని ఇప్పటివరకూ ఎన్టీఆర్ టీమ్ అధికారికంగా కన్ ఫామ్ చేయలేదు.
అయితే నాన్న పాత్రలో అభినయించేందుకు కళ్యాణ్ రామ్ ఆసక్తిగా ఉన్నారని చెప్పుకున్నారు. ఇంతలోనే ఈ ఘోరం.. నేటి ఉదయం నందమూరి హరికృష్ణ విజయవాడ హైవేలో నల్గొండ సమీపంలో భారీ యాక్సిడెంట్‌కి గురై మరణించారన్న వార్త అందింది. కళ్యాణ్‌రామ్‌కి ఇది ఊహించని విఘాతం. ఇదివరకూ అన్న జానకిరామ్‌ని ఇదే హైవేలో యాక్సిడెంట్ రూపంలో కోల్పోయాడు. ఇప్పుడు తన తండ్రిని ఘోర ప్రమాదంలో కోల్పోవడం ఎంతో బాధాకరం. ప్రస్తుతం నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషాదం నుంచి కోలుకునేందుకు ఆ కుటుంబానికి చాలానే సమయం పడుతుందనడంలో సందేహం లేదు.