Begin typing your search above and press return to search.

మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్న ఫ్యామిలీ దర్శకుడు

By:  Tupaki Desk   |   22 Sep 2019 3:11 PM GMT
మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్న ఫ్యామిలీ దర్శకుడు
X
ఒక్కో దర్శకుడి నుండి ఒక్కో టైప్ జోనర్ సినిమా ఎక్స్ పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు. ఆ దర్శకుడు గతంలో చేసిన సినిమాల ఆధారంగా అతనికి ఓ ట్యాగ్ కూడా తగిలిస్తారు. సతీష్ వేగేశ్న కి టాలీవుడ్ లో ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా మంచి పేరుంది. 'శతమానం భవతి' - 'శ్రీనివాస కళ్యాణం' అంటూ వరుసగా రెండు ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ అందించడంతో అందరూ ఇక వేగేశ్న సినిమాలంటే ఓన్లీ క్లాస్ ఆడియన్స్ కి మాత్రమే పరిమితం అనుకునే పరిస్థితి వచ్చేసింది.

అయితే ఇప్పుడు ఆ క్లాస్ ఇమేజ్ నుండి బయటికి రావడానికి చూస్తున్నాడు సతీష్. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో 'ఎంత మంచి వాడవురా' చేస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ అనౌన్స్ చేయగానే ఇది కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకున్నారు ఆడియన్స్. అయితే లేటెస్ట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరికీ షాకిచ్చాడు సతీష్ వేగేశ్న. టైటిల్ కి తగ్గట్టు ఫ్యామిలీ పోస్టర్ వదులుతాడనుకుంటే ఓ యాక్షన్ ఎపిసోడ్ లోని మాస్ స్టిల్ తో ఫస్ట్ రిలీజ్ చేసాడు.

ఫస్ట్ లుక్ తో సినిమాలో మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే ఎలెమెంట్స్ ఉంటాయని చెప్పకనే చెప్పాడు. ఇటీవలే సిద్ధాంతంలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేశారు యూనిట్. ఆ యాక్షన్ ఎపిసోడ్ లోనిదే ఈ స్టిల్ అని తెలుస్తుంది. ఇక నటశా దోషి ఐటమ్ సాంగ్ ఎలాగూ ఉండనే ఉంది. ఈ ఎలెమెంట్స్ తో సంక్రాంతికి క్లాస్ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్ ను కూడా మెప్పించాలని చూస్తున్నాడు వేగేశ్న. మరి ఈ ఫ్యామిలీ దర్శకుడు మాస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయగలడా...? చూడాలి.