Begin typing your search above and press return to search.
కళ్యాణ్ రామ్ టాటూ కథ
By: Tupaki Desk | 8 Feb 2023 12:00 PM GMTఫిలిం సెలబ్రెటీలు టాటూలు వేసుకోవడం కొత్తేమీ కాదు. యంగ్ హీరోలు చాలామంది ఆ బాట పడుతున్న వాళ్లే. వాళ్లు వేయించుకునే టాటూల వెనుక కొన్ని కథలు కూడా ఉంటాయి. కొంచెం ట్రెడిషనల్‌గా కనిపించే నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సైతం తన చేతిపై ఒక టాటూతో కనిపిస్తుంటాడు. తన భార్య స్వాతి పేరునే కళ్యాణ్ రామ్ టాటూగా వేయించుకున్నాడు. ఈ నందమూరి కథానాయకుడిది పెద్దలు కుదిర్చిన పెళ్లే. అయితే పర్టికులర్‌గా తన భార్య పేరును టాటూగా వేయించుకోవడం వెనుక ఒక కథ ఉన్నట్లు కళ్యాణ్ రామ్ తన కొత్త సినిమా అమిగోస్ ప్రమోషన్ల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆ కథేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
"నిజంగా నా భార్య లేకపోతే నేను లేను2007- 2008 టైంలో నాకు ఆరోగ్య సమస్యలొచ్చాయి ఆ సమయంలో నా ఆరోగ్యం అసలు బాగోలేదు. అలాంటి సమయంలో ఏ భార్య అయినా భర్తకు సేవలు చేస్తుంది. కొందరైతే నర్స్‌ను పెట్టి చూసుకోమని చెప్పేస్తారు. కానీ నా భార్య అలా చేయలేదు. నర్సును కూడా వద్దని చాలా కష్టమైన సమయంలో తనే దగ్గరుండి నాకు సేవలు చేసింది.
ఓ తల్లి బిడ్డను ఎలా చూసుకుంటుందో అలా చూసుకొని నన్ను ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దింది. అది నా మనసుకు బాగా తాకింది. మా 10వ పెళ్లి రోజున 'నీకేం కావాలి.. ఏదైనా ఇస్తాను' అని తనని అడిగాను. ఆమె 'నాకేం వద్దు.. నాకు అన్ని ఉన్నాయి.. పక్కన మీరూ, పిల్లలు ఉన్నారు. అంతకుమించి ఇంకేం కావాలి" అని తేల్చేసింది. నా భార్యపై ఉన్న ప్రేమతో తన పేరును టాటూగా వేయించుకున్నాను. అసలు నాకు సూది అంటే చాలా భయం. ఇంజెక్షన్ చేయించుకోవాలన్నా కూడా చాలా భయపడతాను. కానీ ఆ భయాన్ని ఆమె మీద ఉన్న ఇష్టం అధిగమించేలా చేసింది.. అలా ఈ టాటూ నా చేతి మీదకొచ్చింది" అని కళ్యాణ్ రామ్ చెప్పాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.