Begin typing your search above and press return to search.
కళ్యాణ్ రామ్ ముందే హెచ్చరించాడా?
By: Tupaki Desk | 23 Aug 2015 6:11 PM GMTభారీ అంచనాల మధ్య విడుదలైన ‘కిక్-2’ డివైడ్ టాక్ తో మొదలైంది. నిజానికి కొంచెం జాగ్రత్త పడి ఉంటే.. కిక్-2 సునాయాసంగా బాక్సాఫీస్ బండిని లాగేసి ఉండేది. ప్రథమార్ధం అయ్యేసరికి సినిమా బాగుంది అన్న టాక్ వినిపించింది. కానీ చివరికి సగం కడుపు నిండిన ఫీలింగ్ తో బయటికి వచ్చారు. సెకండాఫ్ లో విపరీతమైన లాగ్ ఉండటమే దీనికి కారణం. చివరి అరగంట సినిమా బాగానే ఉన్నా.. అంతకుముందు గంట వ్యవహారం జనాల్ని విపరీతమైన ఫ్రస్టేషన్ కు గురి చేసింది. ఈ విషయంలో అందరు ప్రేక్షకులదీ ఏకాభిప్రాయం. అందుకే నిర్మాత కళ్యాణ్ రామ్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. నిర్మొహమాటంగా 20 నిమిషాల కోత వేయించి రెండో రోజు నుంచే ట్రిమ్డ్ వెర్షన్ నడిపిస్తున్నాడు.
ఐతే యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సెకండాఫ్ లో విలేజ్ బ్యాక్ డ్రాప్ వచ్చే సన్నివేశాలకు సంబంధించి కళ్యాణ్ రామ్ ముందే అభ్యంతరాలు చెప్పాడట. లాగ్ ఎక్కువైందని ఫీలయ్యాడట. ఐతే డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రైటర్ వక్కంతం వంశీ ఈ సన్నివేశాల విషయంలో కాంప్రమైజ్ కాలేదట. సినిమాకు ఈ ఎపిసోడే హైలైట్ అవుతుందని.. ‘రేసుగుర్రం’లో చివరి అరగంట కామెడీ ఎపిసోడ్ హైలైట్ అయినట్లే ఇది కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని.. దీన్ని ట్రిమ్ చేస్తే కామెడీ తగ్గిపోతుందని కళ్యాణ్ రామ్ కు సర్దిచెప్పారట. భారీగా ఖర్చు పెట్టి తీసిన సన్నివేశాలు కావడంతో కళ్యాణ్ రామ్ కూడా రాజీ పడిపోయి రిలీజ్ కు రెడీ అయిపోయినట్లు తెలిసింది. ఐతే ఈ ఎపిసోడే ఇప్పుడు సినిమాకు మైనస్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ వల్లే రకుల్ చాలా గ్లామరస్ గా కనిపించిన పాటను కూడా సెకండాఫ్ నుంచి లేపేయాల్సి వచ్చింది కూడా. దాన్ని ఎండ్ టైటిల్స్ పడేప్పుడు వేస్తున్నారు. ఐతే 20 నిమిషాలు కత్తెర వేయడంతో ఇప్పుడు సినిమా బాగా అనిపించే అనిపించే అవకాశం ఉంది. ఐతే ఇప్పటికే కొంత నష్టం జరిగిపోయింది. డివైడ్ టాక్ స్ప్రెడ్ అయింది. కాకపోతే ఇప్పటికైనా మేల్కొనడం వల్ల సినిమాకు మంచి జరిగే అవకాశముంది.