Begin typing your search above and press return to search.

చైనా వాడు బాలు పాటలో అదరగొడితే..

By:  Tupaki Desk   |   21 March 2017 9:05 AM GMT
చైనా వాడు బాలు పాటలో అదరగొడితే..
X
బాలీవుడ్ గాయకుల్ని పట్టుకొచ్చి తెలుగులోనో.. తమిళంలోనో ఒక పాట పాడిస్తే.. ఎక్కడో ఒక చోట తేడా వచ్చేస్తుంది. ఇక్కడి పదాల్ని వాళ్లు సరిగ్గా పలకరు. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ వాళ్లకు చాలా కష్టంగా అనిపిస్తాయి. శ్రియ ఘోషల్ తరహాలో ఎంతో సాధన చేస్తే తప్ప సౌత్ భాషలపై పట్టు చిక్కదు. ఐతే ఒక చైనా కుర్రాడు.. తమిళంలో ఇళయరాజా-ఎస్పీ బాలసుబ్రమణ్యం కాంబినేషన్లో వచ్చిన పాటలకు ముగ్ధుడైపోయి.. ఆ పాటల్ని సాధన చేసి.. స్వయంగా ఒక తమిళ పాటను పాడి.. రికార్డ్ చేసి.. దాన్ని ఎస్పీ బాలుకు ట్రిబ్యూట్ గా సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. ఆ ఔత్సాహికుడి పేరు.. క్వి మి.

అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న మి కి తమిళ పాటల మీద గురి కుదిరింది. 1989లో విడుదలైన ‘పుదు పూతు అర్థంగల్’ అనే సినిమాలో ఇళయరాజా కంపోజిషన్లో బాలు పాడిన కళ్యాణ మాలై కొండాడుం పెన్నే అంటూ సాగే పాటను అతను సాధన చేశాడు. తనకు ఈ పాటంటే ఎంతిష్టమో ఇంట్రడక్షన్ ఇచ్చి.. ఈ పాటను రికార్డింగ్ స్టూడియోలో పాడుతున్న వీడియోను రికార్డ్ చేసి షేర్ చేశాడు మి. అతడి కమిట్మెంట్ చూసి బాలు ముగ్ధుడైపోయాడు. తమిళం చాలా కష్టమైన భాష అని.. ఇలా ఒక చైనీయుడు ఆ భాష నేర్చుకుని.. ఇలా పాట ఆలపించడం అద్భుతమైన విషయమని.. తమిళ గాయనీగాయకులే తమిళంలో పాటల్ని తప్పు తప్పుగా పాడుతున్న సమయంలో మి చూపిని కమిట్మెంట్ అమోఘమని చాలా ఉద్వేగంగా స్పందించాడు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/