Begin typing your search above and press return to search.
కళ్యాణ మండపం స్ట్రీమింగ్ కు రెడీ
By: Tupaki Desk | 17 Aug 2021 8:30 AM GMTథియేటర్లు కరోనా కారణంగా మూత పడి ఉన్న సమయంలో ఓటీటీ లపై ప్రేక్షకులు ఆధారపడ్డారు. ఓటీటీ లో వినోదాన్ని పొందారు. థియేటర్లు పూర్తిగా ఓపెన్ అయినా కూడా ఇంకా జనాలు మాత్రం థియేటర్లకు రావడం లేదు. కరోనా భయం ఇంకా జనాల్లో పూర్తిగా తొలగి పోలేదు. దాంతో చిన్న సినిమాలను చూసేందుకు జనాలు స్వేచ్చగా థియేటర్లకు రాలేక పోతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా థియేటర్లలో కనిపించడం లేదు. మల్టీ ప్లెక్స్ ల్లో కాస్త జనాలు ఉంటున్నా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రం జనాలు కనిపించడం చాలా తక్కువ అయ్యింది. సెకండ్ వేవ్ తర్వాత విడుదల అయిన సినిమాలు కొన్ని పాజిటివ్ టాక్ ను దక్కించుకున్నా ఆ రేంజ్ లో వసూళ్లు మాత్రం నమోదు అవ్వడం లేదు. ఇటీవల విడుదల అయిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాని వసూళ్ల విషయంలో మాత్రం బిగ్ సక్సెస్ దక్కలేదు.
కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉందంటూ పబ్లిక్ టాక్ దక్కింది. కాని కొత్త సినిమాలు రావడంతో ఎస్ ఆర్ కళ్యాణ మండపం వసూళ్లు మరింత తగ్గాయి. థియేటర్ల ద్వారా రావాల్సిన మొత్తం వచ్చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా టాక్ వినిపిస్తుంది. కళ్యాణ మండపం ను ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ చేస్తున్నారు. ఆహా వారు ఈ సినిమాను స్ట్రీమింగ్ కు గాను కొనుగోలు చేశారు. ఆహా ఓటీటీ సోషల్ మీడియా ద్వారా సినిమాను త్వరలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ప్రకటన కూడా చేసింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల చివరి వరకు ఆహా లో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందంటున్నారు.
కరోనాకు ముందు థియేటర్లలో విడుదల అయిన సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కు చాలా సమయం పట్టేది. కాని ఇప్పుడు మాత్రం మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ఆహా లో ఇప్పటికే పలు సినిమాలు స్ట్రీమింగ్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాను కూడా ఆహాలో స్ట్రీమింగ్ కు సిద్దం చేశారు. చిన్న సినిమాలను కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలను చూసి మరీ తీసుకుంటున్న ఆహా వారు మరో మంచి సినిమాను తమ ప్రేక్షకులకు అందించేందుకు సిద్దం అయ్యారు. ఆహా ఖాతాదారులు ఎస్ ఆర్ కళ్యాణ మండపం స్ట్రీమింగ్ తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు. అతి త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.