Begin typing your search above and press return to search.

నాగశౌర్య రేంజ్ పెరిగింది

By:  Tupaki Desk   |   2 March 2016 4:11 AM GMT
నాగశౌర్య రేంజ్ పెరిగింది
X
‘ఊహలు గుసగుసలాడే’ మూవీ హిట్ తో టాలీవుడ్ లోకి ప్రామిసింగ్ యంగ్ హీరోగా అడుగుపెట్టిన నాగశౌర్య... ఆ తరువాత లక్ష్మీ రావే మా ఇంటికి - దిక్కులు చూడకు రామయ్య సినిమాలతో తనకంటూ ఓ ట్రేడ్ ను ఇండస్ట్రీలో ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మాస్ హీరోగా ఎదగాలని నటించిన జాదుగాడు - అమ్మాయితో అబ్బాయిలాంటి సినిమాలు నాగశౌర్యను కమర్షియల్ గా నిలబెట్టలేకపోయాయి. ఇప్పుడు తాజాగా మరో యూత్ ఫుల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. నందిరెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంలో నాగశౌర్య - మాళవిక నాయర్(ఎవడే సుబ్రమణ్యం ఫేం) కలిసి నటించారు. వన్ లైఫ్ వన్ సెలబ్రేషన్ అనే క్యాప్షన్ తో ఈ సినిమా నుంచి ఓ మెసేజ్ ను కూడా ఇవ్వబోతున్నారు. పురాణాల్లో కానీ, శాస్త్రాల్లోగానీ పెళ్లి గురించి ప్రస్తావించారే తప్ప... విడాకుల గురించి ఎక్కడా రాయలేదు. ఓ జంట ఒక్కటయ్యారంటే... ఇక జీవితాంతం కలిసి వుండాలి.. విడిపోవడానికి తావులేదనే మెసేజ్ ను నేటి యువతకు ఇవ్వడానికి ట్రై చేసింది చిత్ర యూనిట్.

అందుకే ఈ చిత్రాన్ని మాగ్జిమమ్ స్క్రీన్లలో విడుదల చేయాలని నిర్మాత కె.ఎల్.దామోదర ప్రసాద్ భావిస్తున్నాడు. గతంలో నాగశౌర్య నటించిన చిత్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్ లోనూ కలిపి కేవలం 300 స్క్రీన్లలోనే ప్రదర్శించబడినాయి. అయితే ఈ చిత్రాన్ని మాత్రం దాదాపు 450 స్క్రీన్లలో రిలీజ్ చేయబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 350 స్క్రీన్లలోనూ, ఓవర్సీస్ లో కెనడా, యుఎస్ లో 80 స్క్రీన్లలోనూ, యుకె, ఆస్ట్రేలియా తదితర చోట్ల మరో 20 స్క్రీన్లలో ప్రదర్శించడానికి ప్లాన్ చేసింది చిత్ర బృందం. ఇలా నాగశౌర్య గత చిత్రాల కంటే.. ఈ చిత్రానికి రేంజ్ పెరిగింది. ఇప్పటికే మంచి బిజినెస్ చేసిన ఈ చిత్రం.. నాగశౌర్య కెరీర్లో మరో యూత్ ఫుల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అవుతుందని భావిస్తున్నారు. వివాహవ్యవస్థ చాలా పలుచన బడుతున్న ఈ తరుణంలో ఇలాంటి సినిమాలు తప్పకుండా యూత్ ను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం భావిస్తోంది.