Begin typing your search above and press return to search.
అక్కడ కలెక్షన్ల వైభోగమే..
By: Tupaki Desk | 7 March 2016 6:36 AM GMTఅయితే హిట్టు.. లేదంటే ఫట్టు.. ఏవరేజ్ సినిమా అనే మాటే లేదు ఈ రోజుల్లో. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. కలెక్షన్లు ఎంత బాగుంటున్నాయో.. నెగెటివ్ టాక్ వస్తే అంత దారుణంగా ఉంటోంది పరిస్థితి. ఈ శుక్రవారం విడుదలైన సినిమాల్లో శౌర్య అత్యంత భారీగా విడుదలైంది. దాని మీద అంచనాలు కూడా ఎక్కువే ఉన్నాయి. కానీ ‘కళ్యాణ వైభోగమే’ తక్కువ థియేటర్లలో రిలీజైంది. దీని మీద అంచనాలు కూడా తక్కువే. కానీ శౌర్య నెగెటివ్ టాక్ తో మొదలవగా.. ‘కళ్యాణ వైభోగమే’కు మంచి టాక్ వచ్చింది. దీంతో తొలి రోజు సాయంత్రానికే ఏ సినిమా సత్తా ఏంటన్నది థియేటర్ల దగ్గర పరిస్థితి చూస్తేనే అర్థమైపోయింది. ఉదయం ఉన్న పరిస్థితి తలకిందులై ‘శౌర్య’ డల్ అయిపోగా... ‘కళ్యాణ వైభోగమే’ థియేటర్లలో క్రౌడ్ పెరిగిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లో అయినా శౌర్య పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది కానీ.. యుఎస్ లో అయితే దారుణం. తొలి మూడు రోజుల్లో ఆ సినిమా అక్కడ కేవలం 40 వేల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. కానీ ‘కళ్యాణ వైభోగమే’ మాత్రం ఏకంగా లక్ష డాలర్లు కలెక్ట్ చేయడం విశేషం. ఆదివారం ఒక్కరోజే 60 వేల డాలర్లు రావడం విశేషం. ఫుల్ రన్ లో ఈ సినిమా ఈజీగా రెండు లక్షల డాలర్లు వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడి ప్రకారం చూస్తే ఇది చాలా పెద్ద ఫిగరే. గతంలో కేవలం స్టార్ హీరోల సినిమాల్ని మాత్రమే ఆదరించేవారు ఓవర్సీస్ ఆడియన్స్. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్లయితే చిన్న సినిమాల్ని కూడా బాగానే చూస్తున్నారు. గత ఏడాది నాని సినిమా ‘భలే భలే మగాడివోయ్’ ఇలాగే సెన్సేషనల్ హిట్టయింది. ఈ ఏడాది ‘నేను శైలజ’ కూడా అక్కడ మంచి విజయాన్నందుకుంది. ఆ తర్వాత మంచి వసూళ్లు అందుకుంటున్న మీడియం రేంజి సినిమా ఇదే.