Begin typing your search above and press return to search.
ఒక హిట్టు.. ముగ్గురికి లైఫ్
By: Tupaki Desk | 4 March 2016 7:30 PM GMTఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటుంటారు.ఇక్కడ ముగ్గురు కలిసి ఒక్క పిట్టను కొట్టారు. అది హిట్టు అనే పిట్ట కాగా.. ఆ ముగ్గురూ గురిపెట్టిన బాణం పేరు కళ్యాణ వైభోగమే.ఆ ముగ్గురిలో ముందుగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ నందిని రెడ్డి గురించే. దర్శకురాలిగా తన తొలి సినిమా ‘అలా మొదలైంది’తో ఎంత మంచి పేరు తెచ్చుకుందో.. రెండో సినిమా ‘జబర్దస్త్’తో అంత చెడ్డ పేరూ ఖాతాలో వేసుకుంది నందిని. సినిమా జస్ట్ ఫ్లాపైతే వేరు కానీ.. హిందీ హిట్ మూవీ బ్యాండ్ బాజా బారత్ ను దాదాపు 75 శాతం దించేయడంతోనే వచ్చింది సమస్య. అసలే కాపీ సినిమా.. పైగా ప్రేక్షకులకు రుచించలేదు. దీంతో నందినిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దెబ్బకు రెండేళ్లకు పైగా గ్యాప్ వచ్చేసింది. ఈ స్థితిలో మళ్లీ కొత్తగా తనేంటో రుజువు చేసుకోవాల్సిన స్థితిలో పడిందామె.
ఇక ఊహలు గుసగుసలాడే - దిక్కులు చూడకు రామయ్యా హిట్టు సినిమాలతో ఎమర్జింగ్ హీరోగా పేరు సంపాదించిన నాగశౌర్య.. లక్ష్మీ రావే మా ఇంటికి - జాదూగాడు - అబ్బాయితో అమ్మాయి లాంటి ఫ్లాపులతో కంగుతిన్నాడు.ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ పరిస్థితి కూడా ఇంతే. హోరాహోరీ ఆయన బేనర్ పేరును బాగా చెడగొట్టింది. ఇలా ఈ ముగ్గురికీ అత్యవసరంగా ఓ హిట్టు పడాల్సిన పరిస్థితిలో కళ్యాణ వైభోగమే మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమా తేడా వస్తే ముగ్గురూ చాలా ఇబ్బందుల్లో పడేవారే. ఐతే కళ్యాణ వైభోగమే తొలి షో నుంచే పాజిటివ్‌టాక్ తెచ్చుకుని మంచి హిట్ అయ్యేలా కనిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమా ఆ ముగ్గురికీ లైఫ్ ఇచ్చిందనడంలో సందేహం లేదు.