Begin typing your search above and press return to search.

ఫైన‌ల్ గా చిన్న‌హీరోని బుక్ చేశారుగా!

By:  Tupaki Desk   |   10 Jan 2023 3:36 PM GMT
ఫైన‌ల్ గా చిన్న‌హీరోని బుక్ చేశారుగా!
X
సంక్రాంతి స‌మ‌రంలో పెద్ద హీరోలు పోటీప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే పెద్ద మీరోల‌తో పాటు ఈ పోటీలో చిన్న హీరో కూడా సై అంటూ రంగంలోకి దిగేస్తున్నాడు. పెద్ద హీరోలంతా ముందుగానే స్లాట్ ల‌ని బుక్ చేసుకోవ‌డంతో చిన్న హీరో ఫెస్టివ‌ల్ డేట్ ని రిజ‌ర్వ్ చేసుకున్నాడు. జ‌న‌వ‌రి 14న ఎవ‌రూ పోటీలో లేరు. రారు అనే ధైర్యంతో ఆ డేట్ ని ఎంచుకున్నాడు. అయితే ముందు రిలీజ్ అవుతుంద‌నుకున్న స్టార్ హీరో సినిమా డేట్ మార‌డంతో ఇప్ప‌డు చిన్న హీరో బుక్కైపోయాడ‌ట‌.

వివ‌రాల్లోకి వెళితే.. సంక్రాంతి స‌మరంలో స్టార్ హీరోలు నంద‌మూరి బాల‌కృష్ణ‌, మెగాస్టార్ చిరంజీవి, అజిత్‌, విజ‌య్ జ‌న‌వ‌రి 11 నుంచి 13 వ‌ర‌కు రిలీజ్ డేట్ ల‌ని ప్ర‌క‌టించి లాక్ చేసేశారు. త‌మిళ స్టార్ హీరో అజిత్ న‌టిస్తున్న `తునీవు` తెలుగులో `తెగింపు` పేరుతో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీని జ‌న‌వ‌రి 11నే విడుద‌ల చేస్తున్నారు. బోనీ క‌పూర్ నిర్మించిన ఈ మూవీపై అజిత్ అభిమానులు భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు.

ఇక 12న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `వీర సింహారెడ్డి` రిలీజ్ కానుంద‌డ‌గా, జ‌న‌వ‌రి 13న మెగాస్టార్ చిరంజీవి న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌` రిలీజ్ కు సిద్ధ‌మ‌యింది. 12న ముందు అనుకున్న ప్ర‌కారం విజ‌య్ `వార‌సుడు`ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. అంతా అయిపోయింది. అయితే ఫైన‌ల్ గా రిలీజ్ డేట్ ని 12 నుంచి 14కు మార్చేశారు. ఈ మూడు సినిమాలు 11 నుంచి 13 వ‌ర‌కు రిలీజ్ డేట్ ల‌ని ఫైన‌ల్ చేసుకోవ‌డంతో చిన్న హీరో సంతోష్ శోభ‌న్ సినిమా క‌ల్యాణం క‌మ‌నీయం`కోసం జ‌న‌వ‌రి 14ను ఫిక్స్ చేసుకున్నారు.

ఆ రోజు మ‌న‌కు పోటీ ఎవ‌రూ లేరు.. మ‌న‌తో పోటీ ఎవ‌రూ రారు అని బిందాస్ గా వున్న `క‌ల్యాణం క‌మ‌నీయం` టీమ్ కు `వార‌సుడు` బిగ్ షాక్ ఇచ్చాడ‌ట‌. దీంతో యంగ్ హీరో ఊహించ‌ని ట్విస్ట్ కు యంగ్ హీరో అడ్డంగా బుక్కైపోయాడనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. న్యూ ఏజ్ క‌పుల్ స్టోరీ నేఫ‌థ్యంలో సాగే ఓ అంద‌మైన జంట క‌థ‌గా ఈ మూవీని తెర‌కెక్కించారు.

రెగ్యుల‌ర్ సినిమాల‌కు పూర్తి భిన్నంగా యువీ క్రియేష‌న్స్ వారి యువీ క‌నెక్ట్స్ నిర్మించ‌డంతో ఈ సినిమా ఫ‌లితం ప‌ట్ల హీరో సంతోష్ శోభ‌న్ ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడ‌ని చెబుతున్నారు. ఇదిలా వుంటే సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ప్ర‌మోష‌న్స్ జోష్ పెంచిన టీమ్ మంగ‌ళ‌వారం ప్ర‌భాస్
చేత `వెడ్డింగ్ అంథెమ్` లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.