Begin typing your search above and press return to search.
బాహుబలి క్రెడిట్ తమ్ముడికీ ఇవ్వాలి
By: Tupaki Desk | 24 July 2015 8:25 PM GMTబాహుబలి.. దేశవిదేశాల్లో సంచలనం రేపుతున్న సినిమా. ఈ సినిమాకు వాడిన టెక్నాలజీ మీద కూడా చాలా చర్చ జరుగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు దీనికి ఉపయోగించిన సౌండ్ టెక్నాలజీ గురించి కూడా బాలీవుడ్ లో మాట్లాడుకుంటున్నారు. ఐతే ఈ క్రెడిట్లో కీరవాణి తో పాటు ఆయన తమ్ముడు కళ్యాణి కోడూరికి కూడా భాగం ఉంది. అన్నతో కలిసి చాలా రోజుల పాటు శ్రమించి ‘బాహుబలి’ సౌండ్ మిక్సింగ్ విషయంలో తిరుగులేని ఔట్ పుట్ ఇచ్చాడు కళ్యాణి. ఇంతకీ బాహుబలిలో అతనెందుకు భాగమయ్యాడో కళ్యాణి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.
‘‘గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలకు నేను సౌండ్ మిక్సింగ్ బాధ్యతలు నిర్వహించా.
‘బాహుబలి’కి డాల్బీ అట్మాస్ అనే సౌండ్ సిస్టమ్‌ను ఉపయోగించాలనే ఆలోచనలో రాజమౌళి ముంబైలో టెక్నాలజీ గురించి పరిశోధించాడు. అప్పుడే కొంత భాగం మిక్సింగ్ చూసిన రాజమౌళి, ఔట్‌పుట్ చూసి సంతృప్తి చెందలేదు. అదే సమయంలో నన్ను పిలిచి మిక్సింగ్ బాధ్యతలు అప్పజెప్పారు. నెలరోజులు కష్టపడి ఈ సినిమాకు మిక్సింగ్ పనులు పూర్తి చేశా. సౌండ్ మిక్సింగ్ పనులు కొన్ని పూర్తయ్యాక.. నేను, కీరవాణి, రాజమౌళి ముంబైలోని ఓ థియేటర్లో కొన్ని సన్నివేశాలు చూశాం. అప్పుడే మాకో నమ్మకం వచ్చింది. ఇక మొత్తం ఔట్‌పుట్ చూశాక రాజమౌళి నన్ను గట్టిగా కౌగిలించుకొని, ‘నా రెండున్నరేళ్ళ కష్టాన్ని నీ సౌండ్ మిక్సింగ్‌తో మరింత అందంగా తీర్చిదిద్దావ్’ అని ప్రశంసించాడు. నాకొచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అది. ఇప్పుడు ప్రేక్షకులు కూడా సినిమాకు వాడిన సౌండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటుండటం సంతోషంగా ఉంది’’ అని కళ్యాణి చెప్పాడు.