Begin typing your search above and press return to search.
హోరాహోరీ: ఫోకస్ పెట్టాల్సింది కళ్యాణ్ సాబ్
By: Tupaki Desk | 12 Sep 2015 7:30 AM GMTలవ్ స్టోరీస్ కి దర్శకత్వం, సినిమాటోగ్రఫీ ఎంత కీలకమో సంగీతం కూడా అంతే ముఖ్యం. సినిమా థీమ్ ని - టోటల్ ఫీల్ ని క్యారీ చేసేది సంగీతమే. పాటలు - రీరికార్డింగ్ ఇవి రెండూ అత్యంత కీలకం. ఇకపోతే తేజ దర్శకత్వం వహించిన హోరా హోరీ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సోదరుడు కళ్యాణ్ కోడూరి సంగీతం అందించాడు. అలా మొదలైంది - అష్టా చెమ్మా - గోల్కొండ హైస్కూల్ - ఊహలు గుసగుసలాడే వంటి సినిమాలతో కళ్యాణ్ కోడూరి విజయాలు అందుకున్నాడు. అయితే ఈసారి తేజ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ చేతిలో పడ్డాడు కాబట్టి అతడి స్థాయి మరింత మెరుగవుతుందనే అనుకున్నారంతా.
అయితే హోరాహోరీకి కోడూరి మ్యూజిక్ ప్లస్ అయ్యిందా? మైనస్ అయ్యిందా? అన్న ప్రశ్నకు విమర్శకుల నుంచి పెదవి విరుపులే కనిపిస్తున్నాయి. చిత్రం - నువ్వు-నేను - జయం సినిమాలకు ఆర్.పి.పట్నాయక్ ఎలాంటి మ్యాజిక్ చేశాడో అలాంటి మ్యాజిక్ ని చేస్తాడనుకుంటే అసలు ఈ సినిమాలో పాటలే తేలిపోయేలా చేశాడు. ఇందులో గుండె లవ్ లవ్ అంటూ వచ్చే ఓ పాటతో పాటు మరో రెండు బాగానే విన్నా.. ఎందుకో అవి సూపర్ హిట్ అయ్యే స్థాయిలో లేవు. దానితో సినిమాకు కాస్త మైనస్సే అనిపిస్తోంది. ఇక రీరికార్డింగ్ విభాగంలో కొన్ని సన్నివేశాల్లో కోడూరి ఇరగదీసినా.. బాహుశా ఆయనకు రిజల్టు ముందే తెలుసు కాబట్టి కొన్ని ఎమోషనల్ సీన్ లులో తేల్చేశాడు. బాగానే ఉందే అనిపించడం వేరు - అబ్బో కేక అనిపించడం వేరు. ఈ రెండోది అనిపిస్తేనే సినిమా సూపర్ హిట్టయ్యేది.
యువతరం గుండె నరాల్ని పట్టి మీటేసేదే మ్యూజిక్. నిలుచున్న చోటే, కూచున్నచోటే డ్యాన్స్ ఆడేయాలి. అలా చేయగలిగినప్పుడే మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెసైనట్టు. ఏదో బాగానే ఉన్నాయ్ అని అంటున్నారు కాని ఒక చిత్రం - ఒక నువ్వు నేను పాటల టైపులో జనాలు ఈ సినిమా పాటలను పాడుకోవడట్లేదు మరి. ఇంకాస్త ఫోకస్ చేసుండాల్సింది కళ్యాణ్ సాబ్.