Begin typing your search above and press return to search.
కీరవాణి తమ్ముడు పస్తులున్న వేళ..
By: Tupaki Desk | 21 Jan 2016 7:30 PM GMTఅన్నయ్య పేద్ద మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు. తమిళ - హిందీ భాషల్లోనూ సత్తా చాటుకున్నాడు. తమ్ముడికీ మంచి టాలెంట్ ఉంది. అన్నయ్య తలుచుకుంటే తమ్ముడికి అవకాశాలిప్పించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ తమ్ముడు మాత్రం తన కాళ్లపై తనే నిలవాలనుకున్నాడు. అందుకోసం నానా కష్టాలు పడ్డాడు. ఇంటి రెంటు కట్టలేక, కనీసం కడుపు నిండా తిండి కూడా తినలేక ఇబ్బందులు పడ్డాడు. చివరికిప్పుడు తనకంటూ ఓ పేరు సంపాదించుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. ఆ సంగీత దర్శకుడు మరెవరో కాదు.. కళ్యాణి మాలిక్ ఉరఫ్ కళ్యాణి కోడూరి. ఒకప్పుడు తాను పడ్డ ఇబ్బందుల్ని ఓ ఇంటర్వ్యూ లో షేర్ చేసుకున్నాడు కళ్యాణి.
అన్నయ్య కీరవాణి సంగీత దర్శకుడిగా మంచి స్థాయిలో ఉండగానే కళ్యాణి సింగర్ గా అవకాశాల కోసం సొంత ప్రయత్నాలు చేశాడట. ఊర్లో తనకున్న పొలం అమ్మి మరీ ముంబయి - చెన్నై నగరాలకు వెళ్లి అవకాశాల కోసం ట్రై చేశాడట. ఐతే ఎవ్వరూ ఛాన్సులు ఇవ్వకపోవడంతో చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. చివరికి 2 వేల రూపాయల రెంటు కట్టలేని స్థితికి రావడమే కాదు.. కొన్ని పూటలు పస్తులుండాల్సిన దుస్థితి కూడా ఎదుర్కొన్నాడట. తిరిగి హైదరాబాద్ వచ్చాక ఎట్టకేలకు ‘ఐతే’ సినిమాతో తనకు బ్రేక్ వచ్చిందని చెప్పాడు కళ్యాణి. ఐతే ఆ సినిమాకు ఎంత పేరు వచ్చినా అవకాశాలు రాలేదని.. తాను పారితోషకంగా రూ.50 లక్షలు డిమాండ్ చేయడం కూడా దానికి ఒక కారణమని అన్నాడు కళ్యాణి. ఐతే ప్రస్తుతం తన కెరీర్ చాలా బాగుందని.. సంతృప్తికరంగా జీవనం సాగిస్తున్నానని చెప్పాడతను.