Begin typing your search above and press return to search.
హలో మరచిపోలేని జ్ఞాపకం
By: Tupaki Desk | 20 Jan 2018 2:30 AM GMTతెలుగు తెరకు సాదరంగా ఏ హీరోయిన్ వచ్చినా ఈ రోజుల్లో మినిమామ్ హిట్టుతోనే అడుగుపెడుతున్నారు. ముఖ్యంగా మలయాళీ ముద్దుగుమ్మలకి టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. ఎందుకో గాని వారి అందానికి మన ప్రేక్షకుల ఇట్టే కనెక్ట్ అయిపోతారు. అలా హలో సినిమా తో హలో చెప్పి కనెక్ట్ అయిన బ్యూటీ కల్యాణి ప్రియాదర్శన్. నటి లిజిల దర్శకుడు ప్రియదర్శన్ దంపతుల కుమార్తె అయిన కల్యాణి మొదటి సినిమాతోనే మంచి ప్రశంసలను అందుకుంది. ప్రస్తుతం అమ్మడు మన టాలీవుడ్ లో నుంచి కొన్ని ఆఫర్స్ అందుకోవడానికి రెడీగా ఉంది.
ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తనకు ఎక్కువగా టాలీవుడ్ అంటేనే ఇష్టం అని చెప్పింది. ఇంకా ఎం చెప్పిందంటే. కల్యాణి మాట్లాడుతూ.. నా కెరీర్ లో హలో సినిమా మర్చిపోలేని జ్ఞాపకం. టాలీవుడ్ లో నా మొదటి సినిమా అదే కాబట్టి నాకు ఎక్కువగా తెలుగు అంటేనే ఇష్టం. మొదట తెలుగు రాలేదు. బాష మీద పట్టు ఉంటేనే నటనలో మంచి అవుట్ పుట్ వస్తుంది. నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డా. ఇక మలయాళంలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ నాకు నచ్చిన పాత్రలని మాత్రమే ఎంచుకుంటున్నా. ఏ పాత్ర చేసినా అందరికి నచ్చేలా చేయాలని అనుకుంటున్నా. హలో సినిమాలో నా నటనను అందరు మెచ్చుకున్నారు.
మా అమ్మ అయితే ఏడ్చేసింది. ఇక నాన్న నన్ను చూడగానే హగ్ చేసుకున్నారు. అమ్మ సినిమాల్లోని నటనే నాకు కోచింగ్. ఇక నాన్న చేసిన చాలా సినిమాల షూటింగ్ లలో నేను ఉండేదాన్ని. నాగార్జున గారిని చిన్నపుడు చూశా. మళ్లీ హలో సినిమా షూటింగ్ లో చూశాను. ఆయన ఒక కుతురిలా నన్ను చూసుకున్నారు. ఇక దర్శకుడు విక్రమ్ కె కుమార్ గారి టేకింగ్ కూడా చాలా సూపర్బ్. నాన్న ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు. మొదట ఆయన హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నపుడు ఎవరో నా గురించి చెప్పడంతో వెంటనే నా పోర్ట్ ఫోలియో చూసి ఒకే చేయడంతో నేను కూడా ఇలాంటి మంచి మొదటి అవకాశాన్ని వదులుకోకూడదని ఒకే చేశాను. ఇక అఖిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే చాలా కష్టపడతాడు. అతనితో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందని కల్యాణి తన మొదటి సినిమా ప్రయాణం అనుభూతిని వివరించింది.