Begin typing your search above and press return to search.

పెళ్లి లేదంటూనే.. అన్ని చెప్పేస్తోంది..

By:  Tupaki Desk   |   3 March 2018 10:38 AM GMT
పెళ్లి లేదంటూనే.. అన్ని చెప్పేస్తోంది..
X
హలో మూవీతో తెరంగేట్రం చేసిన బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్. ఈమె దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె అనే సంగతి తెలిసిందే. ఇప్పుడే సినిమాల్లోకి వచ్చిన ఈమెపై.. అప్పుడే పెళ్లి వార్తలు వచ్చేస్తున్నాయి. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ తో ప్రేమలో పడిపోయిందనే వార్తలు షికార్లు కొడుతున్నాయి.

ఈ స్టార్ కిడ్స్ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అంటున్నారు. వీటిపై క్లారిటీ ఇఛ్చే ప్రయత్నాన్ని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చేసింది కళ్యాణి. ప్రణవ్ సోదరి విస్మయ.. తన సోదరుడి ఫోటోని మొదటగా పంపిందట. ఆ పిక్ ను పేరెంట్స్ తో షేర్ చేసిందట కళ్యాణి. ఆ తర్వాత కళ్యాణి మదర్.. ప్రణవ్ తల్లికి ఈ ఫోటోను చూపి.. ఇద్దరూ ప్రేమించుకుంటన్నారేమో అనిందట. అలా ఈ పెళ్లి రూమర్లు మొదలయ్యాయంటూ వీటి గుట్టు విప్పేందుకు ట్రై చేసింది కళ్యాణి ప్రియదర్శన్. అయితే.. ప్రణవ్ ఇష్టాయిష్టాల నుంచి అతని వ్యక్తిత్వం వరకూ అవపోసన పట్టేసినట్లు చెబుతుండడం ఆశ్చర్యం కలిగించింది.

ఓ స్టార్ కిడ్ అనే ఫీలింగే ప్రణవ్ కి ఉండదట. జేబులో 500 రూపాయలు పెట్టుకుని జర్నీలు చేస్తుంటాడట. అప్పుడప్పుడు లారీల్లో తిరిగేస్తుంటాడట. కాళ్లకు షూస్ వేసుకోవడం మర్చిపోయేంతటి అమాయకుడట. ఆది సినిమా తర్వాత చేతులు మెత్తబడిపోయాయని.. మళ్లీ హిమాలయాలకు వెళ్లి కొండలు ఎక్కాడట. ఇలా ప్రణవ్ మోహన్ లాల్ గురించి జనాలకు తెలియని చాలానే కబుర్లు చెప్పింది కళ్యాణి ప్రియదర్శన్. ఏం లేకుండానే ఇంత సమాచారం కలెక్ట్ చేసింది.. సూపర్ కదూ.