Begin typing your search above and press return to search.

హ‌లో బ్యూటీ సంథింగ్ వ్వావ్ అనేలా

By:  Tupaki Desk   |   7 July 2019 9:30 AM GMT
హ‌లో బ్యూటీ సంథింగ్ వ్వావ్ అనేలా
X
ఎక్స్ పోజింగ్ కంటే ట్రెడిష‌న‌ల్ లుక్ లో క‌నిపించేందుకే ఆస‌క్తి చూపిస్తోంది `హ‌లో` బ్యూటీ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్. స్టార్ డైరెక్ట‌ర్ ప్రియ‌ద‌ర్శ‌న్ వార‌సురాలిగా త‌న‌కంటూ కొన్ని హ‌ద్దుల్ని నిర్ణ‌యించుకుని ఆ బౌండ‌రీస్ ని దాటేందుకు ఇష్ట‌ప‌డ‌ని నాయిక‌గా పాపుల‌రైంది. గ్లామ‌ర్ యాంగిల్ తోనే స్టార్ డ‌మ్ ద‌క్కుతుంద‌న్న ఫార్ములాకు దూరంగా ఉందీ మ‌ల‌యాళీ బ్యూటీ. ప్ర‌స్తుతం సౌత్ లో వ‌రుస‌గా క్రేజీ చిత్రాల్లో న‌టిస్తోంది.

రెండో ప్ర‌య‌త్న‌మే సాయిధ‌ర‌మ్ స‌ర‌స‌న చిత్ర‌ల‌హ‌రిలో నాయిక‌గా న‌టించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం అందుకోవ‌డం క‌ళ్యాణికి కొంత‌వ‌ర‌కూ ప్ల‌స్ అనే చెప్పాలి. ప్ర‌స్తుతం వెర్స‌టైల్ స్టార్ శ‌ర్వానంద్ స‌ర‌స‌న ర‌ణ‌రంగం చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమా స‌క్సెస్ పై క‌ళ్యాణి చాలానే హోప్స్ తో ఉంద‌ట‌. అలాగే డాడ్ ప్రియ‌దర్శ‌న్ రూపొందిస్తున్న హిస్టారిక‌ల్ మూవీలోనూ క‌ళ్యాణి అతిధి పాత్ర‌లో నటిస్తోంది. ఆ చిత్రంలో నాగార్జున ఓ కీల‌క పాత్రను పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో మానాడు.. అలాగే కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో వాన్ అనే తమిళ చిత్రాల్లోనూ క‌ళ్యాణి న‌టిస్తోంది.

ఓవైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే ఫోటోషూట్ల‌తోనూ క‌ళ్యాణి సోష‌ల్ మీడియాలో ట‌చ్ లో ఉంటోంది. తాజాగా వెడ్డింగ్ వావ్స్ మ్యాగ‌జైన్ కి క‌ళ్యాణి ఇచ్చిన ఫోజు అభిమానుల్లోకి వైర‌ల్ గా దూసుకెళ్లింది. ఈ ఫోటోలో ఎంతో ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తున్న క‌ళ్యాణి మునుప‌టితో పోలిస్తే కాస్తంత గ్లామ‌ర్ ట‌చ్ తో ఆక‌ట్టుకుంది. న‌వ‌వ‌ధువు దుస్తుల్లో గ్లామ‌ర్ ట‌చ్ మైమ‌రిపిస్తోంది. రెగ్యుల‌ర్ లుక్ తో పోలిస్తే ఈ గ్లామ‌ర్ ట‌చ్ క‌ళ్యాణికి టాలీవుడ్ లో అవ‌కాశాల్ని పెంచుతుందేమో చూడాలి. ఇక్క‌డ స‌క్సెస్ కి ల‌క్ క‌లిసి రావాలి. దాంతో పాటే గ్లామ‌ర్ ఎలివేష‌న్ చేస్తేనే రంగుల ప్ర‌పంచంలో నాయిక‌గా రాణించ‌డం సాధ్యం. అయితే వీట‌న్నిటికీ అతీతంగా క‌ళ్యాణి వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకోవ‌డం వెన‌క లాజిక్ ఏమిటో త‌నే రివీల్ చేస్తుందేమో చూడాలి.