Begin typing your search above and press return to search.
మహేష్ బాటలో నందమూరి హీరో
By: Tupaki Desk | 23 Feb 2019 8:54 AM GMTహీరోగా, నిర్మాతగా నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ గురించి తెలిసిందే. పటాస్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ .. నటుడిగా ఎంతో పరిణతి సాధించారు. నిర్మాతగానూ `జై లవకుశ` లాంటి బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం హీరోగా నెక్ట్స్ లెవల్ గురించి ఎంతో శ్రమిస్తున్నారు. ఇదే విషయాన్ని నేడు హైదరాబాద్ లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ వెల్లడించారు. మరో ఐదు రోజుల్లో(మార్చి 1న) 118 రిలీజవుతోంది. ఆ తర్వాత పూర్తిగా నేను నటించే సినిమాలపై దృష్టి సారిస్తున్నాను అని తెలిపారు. 118 చిత్రంలో ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా నటించాను. ప్రతి నిమిషయం ఏం జరుగుతుందా? అన్న సస్పెన్స్ ఉత్క ంఠ కలిగిస్తుంది. గుహన్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. మరో మంచి విజయం అందుకుంటున్నాన్న ధీమా ఉంది అని తెలిపారు.
ఈ సినిమా తర్వాత ఏ సినిమాలు చేస్తున్నారు? అంటే కొన్ని స్క్రిప్టులు విన్నాను. అద్భుతమైన కథలు నా దగ్గరికి వచ్చాయి. వాటి గురించి తొందర్లోనే ప్రకటన ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అందరూ వెబ్ సిరీస్ లపై దృష్టి సారిస్తున్నారు కదా? మీరు కూడా ఆ కోణంలో ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నిస్తే .. తప్పకుండా చేస్తున్నాం.. దానికి ఇంకొంచెం సమయం పడుతుంది. ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ నడుస్తోందని అన్నారు. ఒకవేళ వెబ్ సిరీస్ చేస్తే ఎలాంటి జోనర్ చేస్తారు? మీరు నటిస్తారా? అని ప్రశ్నిస్తే.. తాను నటించనని అన్నారు.
ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు యువతరంలో విపరీతమైన ఆదరణ ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ .. నెక్ట్స్ ఏం జరుగుతుందో అన్న టెన్షన్ తో వెబ్ సిరీస్ లు యంగేజ్ చేస్తున్నాయి. అయితే నేను కూడా ఓ మంచి వెబ్ సిరీస్ ని నిర్మిస్తాను. లవ్ స్టోరితో యువతరానికి కనెక్టయ్యే కథనే తయారు చేయిస్తాను అని కళ్యాణ్ రామ్ తెలిపారు. మునుముందు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ తో పాటు డిజిటల్ ప్రపంచంలో వేగం పెరుగుతోందని కళ్యాణ్ రామ్ అన్నారు. డిజిటల్ లో మన సినిమాల రిలీజ్ గురించి ప్రశ్నిస్తే.. వందరోజుల తర్వాత వస్తే బావుంటుందనేది నా అభిప్రాయం అని తెలిపారు. మహేష్ తర్వాత వెబ్ సిరీస్ నిర్మాణంపై దృష్టి సారిస్తున్న హీరోగా కళ్యాణ్ రామ్ పేరు ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. మునుముందు మరింత మంది హీరోల పేర్లు వినిపించడం ఖాయం.