Begin typing your search above and press return to search.
2.0ను ఆడుకుంటున్నాడు
By: Tupaki Desk | 1 Dec 2018 7:04 AM GMTబాక్స్ ఆఫీస్ వద్ద 2.0 ఏ రేంజ్ లో ఫైనల్ ఫిగర్ సాధిస్తుంది అనేది తేలడానికి ఇంకా టైం ఉంది కానీ ఓపెనింగ్స్ గురించిన చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. హిందీ వెర్షన్ కు 20 కోట్ల వసూళ్లే వచ్చాయి అన్న ట్రేడ్ రిపోర్ట్ ఇప్పటికే సినిమా జనాన్ని షాక్ కు గురి చేసింది. వద్దన్నా బాహుబలితో పోలిక వస్తోంది కాబట్టి ఫిగర్స్ ఏ మాత్రం పోటీగా లేకపోవడం తలైవా ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తోంది. ఇక దీని గురించి వివాదాస్పద క్రిటిక్ కం నటుడు కమల్ ఆర్ ఖాన్ ఏకంగా అక్షయ్ కుమార్ ను టార్గెట్ చేసాడు.
చిన్న మీడియం రేంజ్ హీరోలే 30 కోట్లు ఓపెనింగ్స్ తెస్తున్న ట్రెండ్ లో ఇంత పెద్ద స్టార్ అయ్యుండి కేవలం 20 కోట్లేనా అంటూ ట్విట్టర్ లో ఏకిపారేసాడు. విచిత్రంగా రజనిని మెచ్చుకున్న కమల్ ఆర్ ఖాన్ కలెక్షన్లకు మాత్రం అక్షయ్ కుమార్ ను బాధ్యుడిని చేయడం విశేషం. సోషల్ మీడియా కాబట్టి అభిమానులు ఊరికే ఉండే సమస్యే లేదు. కమల్ ఆర్ ఖాన్ మీద రివర్స్ ఎటాక్ మొదలుపెట్టారు. అసలు బాక్స్ ఆఫీస్ లెక్కలు తెలియకుండా ఎలా మాట్లాడతావు అంటూ పద్మావత్-సంజు లాంటి ఉదాహరణలు చూపుతూ నిలదీయడం మొదలుపెట్టారు. కమల్ ఆర్ ఖాన్ అక్కడితో ఆగలేదు. సినిమాను హిట్ చేసినందుకు ట్విట్టర్ లో థాంక్స్ చెప్పిన శంకర్ ను సైతం 200 కోట్లు నష్టం తెచ్చే సినిమాను హిట్ అని చెప్పుకుంటారా అని అడిగేశాడు. శంకర్ ఆ తర్వాత బ్లాక్ చేసారు అది వేరే విషయం.
గతంలో కూడా కమల్ ఆర్ ఖాన్ బాహుబలిని అమీర్ ఖాన్ ని పవన్ కళ్యాణ్ ని విడివిడిగా టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలతో మంచి పబ్లిసిటీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా 2.0 క్రేజ్ ని తనకు అనుకూలంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్న మాటల్లో నిజమైతే ఉంది. మరి 20 కోట్ల వసూళ్లు అంటూ దాదాపు బాలీవుడ్ మీడియా అన్నింటిలోనూ ఓపెనింగ్ డే కలెక్టన్ హై లైట్ అయిన మాట వాస్తవం. కమల్ ఖాన్ చెప్పాడని కాదు కానీ అదేదో నిర్మాతలే ప్రకటిస్తే బెటరేమో