Begin typing your search above and press return to search.
ఆ పిచ్చోడిని ఎందుకు పట్టించుకుంటారు?
By: Tupaki Desk | 4 July 2017 12:30 PM GMTగాడిదకేమి తెలుసు గంధపు చెక్కల వాసన అని ఓ సామెత ఉంటుంది తెలుగులో. బాలీవుడ్లో పేరుమోసిన క్రిటిక్ గా చెప్పుకునే కమల్ ఆర్.ఖాన్ సౌత్ ఇండియన్ స్టార్స్ గురించి చేసే వ్యాఖ్యానాలు చూస్తే మన జనాలకు ఇలాంటి సామెతలే గుర్తుకొస్తాయి. ఇప్పుడు అల్లు అర్జున్ గురించి అతను చేసిన కామెంట్స్ సంగతి వదిలేద్దాం. కొన్ని నెలల కిందట లెజెండరీ యాక్టిర్ మోహన్ లాల్ గురించి అవాకులు చెవాకులు పేలాడతను. మోహన్ లాల్ కు కంప్లీట్ యాక్టర్ అన్న పేరు ఊరికే రాలేదు. ఆ విషయాన్ని బాలీవుడ్ వాళ్లు కూడా ఒప్పుకుని తీరాల్సిందే. ఆయన నటన చూసిన ఎవ్వరైనా ముగ్ధులు కావాల్సిందే. కేవలం మోహన్ లాల్ అవతారం మాత్రమే చూసి ఆయన స్థాయిని అంచనా వేస్తే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఆలాంటి లెజెండ్ గురించి కూడా ఇష్టానుసారం మాట్లాడాడు కమల్. పవన్ కళ్యాణ్ గురించి.. ‘బాహుబలి’ గురించి.. తాజాగా అల్లు అర్జున్ గురించి కూడా చెత్త వ్యాఖ్యానాలు చేశాడు.
ఐతే అతడి ఉద్దేశం ఏంటన్నది మన సౌత్ అభిమానులకు అర్థం కావట్లేదు. బాలీవుడ్ సెలబ్రెటీల మీద కూడా ఇలాంటి వ్యాఖ్యానాలు చేసే అతను పాపులారిటీ పెంచుకున్నాడు. అతడికి కావాల్సింది పబ్లిసిటీ. ఫాలోవర్లు. ఇలా ఎవరిమీదైనా వ్యాఖ్యలు చేసినపుడల్లా మీడియాలో హైలైట్ అవుతాడు. ఫాలోయింగ్ పెంచుకుంటాడు. ఎవరేమన్నా దులుపుకుని వెళ్లిపోతాడతను. జనాలు ఎంత తిడితే అంత మంచిదనుకుంటాడు. అది తెలియక.. అతడి స్థాయి ఏంటో అర్థం కాక సోషల్ మీడియాలో మన ఫ్యాన్స్ రెచ్చిపోతుంటారు. మీడియాలో కూడా వార్తలొస్తుంటాయి. ఇలా అందరూ కలిసి ఓ పిచ్చోడిని హైలైట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను ఇగ్నోర్ చేయడమే వాళ్లకు సరైన శిక్ష అని జనాలు గుర్తించట్లేదు. బాలీవుడ్ వాళ్లు అతణ్ని పట్టించుకోవడం మానేసి చాలా కాలమైంది. ఇక మన సౌత్ జనాలు కూడా అతణ్ని ఇగ్నోర్ చేస్తే బెటర్.