Begin typing your search above and press return to search.
పవన్ రూ.8 కోట్లకు చీట్ చేశాడా?
By: Tupaki Desk | 24 March 2017 6:20 AM GMTసోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎవరైనా.. ఎవరినైనా విమర్శలు చేసుకోవచ్చు. కాకుంటే.. నిజం నిగ్గు తేలటం.. చట్టం తన పని తాను చేయటం లాంటివి కాస్త ఆలస్యంగా జరుగుతుంటాయి. వివాదాస్పద వ్యాఖ్యలకు.. తాము అనుకున్నది చెప్పుకోవటానికి సోషల్ మీడియా సాయంగా నిలుస్తుందనటంలో సందేహం లేదు.
దాదాపు మూడు లక్షలకు పైగా ఫాలోయర్స్ ఉండి.. నటుడు.. నిర్మాత.. విమర్శకుడిగా పేరున్న కమైర్ ఖాన్ షార్ట్ కట్ లో కేఆర్కే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు.. ఆరోపణలు చేశారు. కాటమరాయుడి సినిమా విడుదలకు ఒక రోజు ముందు ట్విట్టర్ వేదికగా.. ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఇందులో.. హైదరాబాద్‌లోని సర్దార్ గబ్బర్ సింగ్ కారణంగా నష్టపోయిన బయ్యర్స్ చేస్తున్న దీక్షకు సంబంధించిన ఫోటోను పెట్టారు. అంతేకాదు.. పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు.
తెలుగు నటుడు పవన్ కల్యాణ్ చీటర్ గా మారారని.. డిస్ట్రిబ్యూటర్ దిలీప్ టాండన్ ను ఎనిమిది కోట్ల మేర చీట్ చేసినట్లుగా ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయాలు తెలుసుకోకుండా.. మిడిమిడి అవగాహనతో ఇలాంటి పోస్టులు చేయటం ఏమాత్రం సరికాదంటూ మండిపడుతున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ కు సంబంధించిన ఆర్థిక విషయాలపై పూర్తిస్థాయిలో అవగాహన లేక..చెప్పుడు మాటలు విని.. ఇలాంటి పోస్టులు పెట్టొదన్న హితవు పలుకుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/