Begin typing your search above and press return to search.

కమల్ 234.. ఎవరు ఊహించని కాంబో..!

By:  Tupaki Desk   |   7 Nov 2022 5:47 AM GMT
కమల్ 234.. ఎవరు ఊహించని కాంబో..!
X
విక్రం సినిమా సక్సెస్ తో కెరియర్ లో మళ్లీ సరికొత్త జోష్ తో కనిపిస్తున్నారు కమల్ హాసన్. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రం సినిమా అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దాదాపు ఆ సినిమ 300 కోట్ల పైన వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది. దాదాపు దశాబ్ధ కాలంగా సరైన హిట్ లేక కెరియర్ లో వెనకపడ్డ కమల్ హాసన్ తాను హిట్టు కొడితే ఎలా ఉంటుందో మరోసారి విక్రం మూవీతో చూపించారు. ఆ సినిమా సక్సెస్ లో అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ కూడ వన్ ఆఫ్ ది మేజర్ హైలెట్ గా నిలిచింది.

ఈ సినిమా తర్వాత హెచ్. వినోద్ తో ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే దానికంటే ముందే కమల్ హాసన్ తో మణిరత్నం క్రేజీ కాంబో మూవీ ఫిక్స్ అయ్యింది. కమల్ హాసన్ 234వ మూవీగా ఈ ప్రాజెక్ట్ వస్తుంది. కమల్ హాసన్ తో మణిరత్నం నాయకుడు సినిమా చేశారు. ఆ మూవీ తర్వాత మళ్లీ 35 ఏళ్లకు వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్నారు.

రీసెంట్ గా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1(PS1) తో బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అందుకున్న మణిరత్నం ప్రస్తుతం ఆ సినిమా పార్ట్ 2 పనుల్లో ఉన్నారు. అది పూర్తి కాగానే కమల్ హాసన్ తో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. కమల్ హాసన్ కూడా మణిరత్నం తో పనిచేయడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కమల్ బర్త్ డే సందర్భంగా మణిరత్నంతో మూవీ ఎనౌన్స్ చేశారు.

మణిరత్నం, కమల్ కాంబోలో ఎలాంటి సినిమా రాబోతుంది. కమల్ ని మణిరత్నం ఈసారి ఎలా చూపించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాకు ఏ.ఆర్ రహమాన్ మ్యూజిక్ అందించనున్నారు.

మణిరత్నం అన్ని సినిమాలకు రహమాన్ మ్యూజిక్ ఉండాల్సిందే. అయితే కమల్ తో మాత్రం తెనాలి తర్వాత కలిసి పనిచేస్తున్నారు రహమాన్. లోకనాయకుడు కమల్ హాసన్ విక్రం తో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోగా ఈసారి మణిరత్నంతో కలిసి మరో ప్రభంజనానికి సిద్ధమవుతున్నారు.

ఓ పక్క శంకర్ తో ఇండియన్ 2 సినిమాని కూడా చేస్తున్న కమల్ హాసన్ త్వరలోనే మణిరత్నం సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ మూవీ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లోనే తెరకెక్కుతుంది.

కమల్ హాసన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.. కమల్ ఓ పాటుగా ఆర్ మహేంద్ర, శివ అనంత్ లు కూడా ఈ మూవీ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు. కమల్ హాసన్ 234 సినిమాని 2024 లో రిలీజ్ ఫిక్స్ చేశారు. దాదాపు పీ.ఎస్ 2 రిలీజ్ తర్వాతే ఈ మూవీ షూటింగ్ మొదలవుతుందని టాక్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.