Begin typing your search above and press return to search.

'విక్రమ్' టీమ్ తో కమల్ అడ్వాన్స్డ్ బర్త్ డే సెలబ్రేషన్స్!

By:  Tupaki Desk   |   2 Nov 2021 3:05 AM GMT
విక్రమ్ టీమ్ తో కమల్ అడ్వాన్స్డ్ బర్త్ డే సెలబ్రేషన్స్!
X
కమలహాసన్ వెండితెరకు దక్కిన వరప్రసాదం .. ప్రయోగాలకు ఆయన కేరాఫ్ అడ్రెస్. తనకి నచ్చిన ప్రయోగాలు చేయడానికి నిర్మాతలు సాహసం చేయనప్పుడు, తనే నిర్మాతగా మారిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా ఆయన నష్టపోయిన సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయినా ఆయన కథా పరంగా .. పాత్ర పరంగా తన ప్రయోగాలకు దూరంగా వెళ్లింది లేదు. ఈ తరం హీరోలతో సమానంగా తన దూకుడు కొనసాగిస్తూనే వస్తున్నారు. 'దశావతారం' సినిమాలో కమల్ ఏయే పాత్రలలో ఉన్నాడనే విషయం కనిపెట్టడం ప్రేక్షకులకు కష్టమైపోయింది. ఆయన అంకితభావానికి ఇంతకుమించిన నిదర్శనం అవసరం లేదు.

కమల్ ఏ పాత్రను పోషించినా .. తెరపై ఆ పాత్ర మినహా ఆయన కనిపించరు .. అదే ఆయన గొప్పతనం. ఆయన తాజా చిత్రంగా 'విక్రమ్' రూపొందుతోంది. తన సొంత బ్యానర్ పై ఆయన ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు జరుగుతోంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, విజయ్ సేతుపతి .. ఫాహద్ ఫాజిల్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ అడ్వాన్స్డ్ గా కమల్ బర్త్ డే సెలబ్రేషన్స్ ను నిర్వహించింది.

ఈ నెల 7వ తేదీన కమల్ పుట్టినరోజు .. అవకాశాన్ని బట్టి అప్పుడప్పుడు ఆయన అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా జరుపుకుంటూ ఉంటారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా అలాంటి సందడి లేదు. అందువలన ఈ సారి ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్ ను మరింత గ్రాండ్ గా జరపాలని 'విక్రమ్' సినిమా టీమ్ భావించింది. అందులో భాగంగానే సెలబ్రేషన్స్ స్టార్ట్ అంటూ కమల్ తో కేక్ కట్ చేయించి కలర్ఫుల్ గా సందడి మొదలుపెట్టేశారు. తన తోటి నటీనటులు .. సాంకేతిక నిపుణుల మధ్య కమల్ పుట్టినరోజు వేడుక మొదలైంది. ఇది నిజంగా కమల్ అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే.

ఇక 'విక్రమ్' సినిమా విషయానికి వస్తే .. ఇది కూడా కమల్ చేస్తున్న ప్రయోగం క్రిందికే వస్తుంది. లుక్ పరంగా .. పాత్ర పరంగా ఆయన తన విశ్వరూపాన్ని మరోసారి ప్రేక్షకులకు చూపించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ వీడియోతోనే కమల్ అందరిలో ఆసక్తిని పెంచారు. 'ఖైదీ' .. 'మాస్టర్' సినిమాలతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మురుగదాస్ తరువాత ఆ స్థాయిలో ప్రభావితం చేసిన దర్శకుడిగా ప్రస్తుతం తమిళనాట ఆయనే పేరే వినిపిస్తోంది. భారీ తారాగణంతో నిర్మితమవుతున్న ఈ సినిమా, సంచలనానికి తెరతీయడం ఖాయమనేది అభిమానుల మాట.